హీరోయిన్ అనిత.( Anitha ) చాలామంది ఈ పేరు వినగానే గుర్తుపట్టకపోవచ్చు కానీ ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమా( Nuvvu nenu movie) హీరోయిన్ అంటే చాలు ఇక గుర్తుపట్టేస్తారు.
అప్పట్లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
ఇప్పటికీ ఈ సినిమా విడుదల అయితే టీవీకి అతుక్కునిపోయి చూసే ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు.తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాలో యువత మనసు దోచేసింది అనిత.

హీరో ఉదయ్ కిరణ్ ( Uday Kiran )తో కలిసి ఆమె చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.కాగా నువ్వు నేను సినిమా తర్వాత కూడా అనితకు మంచి అవకాశాలే వచ్చాయి.తరుణ్ తో నిన్నే ఇష్టపడ్డాను( Ninne Ishtapaddanu ) మూవీ చేసింది.అదేవిధంగా శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండగ లాంటి పలు సినిమాల్లో నటించింది.
కానీ ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా సినిమాలు చేయడం తగ్గిస్తూ క్రమంగా సినిమాలకు దూరమైంది అనిత.ఇక 2003లో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.ఇక 2013 సంవత్సరం పెళ్లి చేసుకుంది అనిత.గోవాలో బిజినెస్ మెన్ రోహిత్ ను పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది.

ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆమె వార్తల్లో నిలుస్తోంది.గత కొన్ని రోజులుగా అనితకు సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.అదేంటి అనిత ( Anitha)ఇంతలా మారిపోయిందేంటి? ఆమె వయసు పెరుగుతోందా? తగ్గుతోందా? అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.