అభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడిన ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తన అభిమానులంటే ఎంతప్రాణమో మరోసారి నిరూపించారు.గతంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లికి చెందిన తల్లితండ్రులు శివాజీ, క్రాంతికుమారిలకు కలిగిన ముగ్గురు ఆడపిల్లల్లో శ్రీనిధి పెద్ద కుమార్తె.

 Jr. Ntr Interacted Via Video Call With His Die Hard Fan Venkanna Ntr, Video Ca-TeluguStop.com

శ్రీనిధికి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది.అత్యవసర చికిత్స కోసం కూకట్ పల్లి రామ్ దేవ్ రావ్ ఆస్పత్రికి తరలించారు.

ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ శ్రీనిధిని పరామర్శించారు.ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన శ్రీనిధి తన అభిమాన హీరోను చూసి ఎంతో సంతోషపడింది.

అలాగే జూనియర్ కూడా చిన్నారి బాధను తీర్చలేకపోయినా కనీసం ఆమె ఆఖరి కోరిక తీర్చగాలిగానని ఆనాడు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా ఎన్టీఆర్.

,తన అభిమాని వెంకన్నతో మాట్లాడారు.చాలా ఏళ్లుగా మంచానికి పరిమితమైన వెంకన్న కండరాల డిస్ట్రోఫీతో బాధపడుతున్నాడు.

అయితే వెంకన్న గురంచి తెలుసుకున్న ఎన్టీఆర్ తన బిజీ షెడ్యూల్ లో సైతం అభిమానికి వీడియో కాల్ ద్వారా పరామర్శించారు.ఈ సందర్భంగా తన విజయానికి కారణం అభిమానులేనని, వారికి రుణపడి ఉంటానని చెప్పాడు .వారిని సంతోష పెట్టడానికి ఎంతనై ప్రయత్నిస్తానని అన్నారు.

ఎస్.

ఎస్.రాజమౌళి డైరక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.డిస్ట్రోఫీతో బాధపడుతున్న తన అభిమాని వెంకన్న గురించి తెలుసుకొని, వీడియో కాల్ చేసి అభిమానిని ఆశ్యర్యానికి గురిచేశారు.వీడియోలో వెంకన్న.,జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు.ఎంతో ఓపికగా విన్న ఎన్టీఆర్ తప్పని సరిగా నిన్ను కలుస్తాను.

అప్పుడు సెల్ఫీ తీసుకుందామని చెప్పాడు.

తరువాత, ఎన్టీఆర్ వెంకన్న తల్లితో మాట్లాడి ఆందోళన చెందవద్దని కోరారు.

బాగా తినాలని వెంకన్నకు సలహా ఇచ్చాడు.ఈవీడియోను వంశీ శేఖర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి.కండరాల సమస్యతో మంచానికి పరిమితయ్యాడంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube