ఎన్టీఆర్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ద్వారా మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఎన్టీఆర్ షో చేయడం కొత్తేమి కాదు ఇంతకు ముందు బిగ్ బాస్ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరించి తన యాంకరింగ్ కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు వేయించుకున్నాడు.ఇప్పుడు ఈ షో కూడా హిట్ అవుతుందని అందరు భావించారు.
కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రేక్షకులను అలరించలేక పోతుంది.ఇప్పటికే ఈ షో ప్రారంభం అయ్యి రెండు వారలు అవుతుంది.
ఈ షో ప్రకటించినప్పుడు బాగా హైప్ వచ్చింది.అందులోను ఎన్టీఆర్ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరించ బోతున్నారని తెలిసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు.
కానీ షో స్టార్ట్ అయ్యాక సీన్ రివర్స్ అయ్యింది.

ఈ షో మొదటి వారం ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా సందడి చేయడంతో జెమిని టివి రేటింగ్స్ అమాంతం పెరిగి పోయాయి.అయితే ఆ తర్వాత ఎపిసోడ్స్ కు మాత్రం అనుకున్నంత రేటింగ్స్ రావడం లేదట ఎన్టీఆర్ హోస్టింగ్ లో ఎలాంటి లోపం లేకపోయినా ఎందుకో ఈ షో కు రేటింగ్ రావడం లేదని టాక్ నడుస్తుంది.వచ్చిన కంటెస్టెంట్స్ తో ఎన్టీఆర్ బాగా మాట్లాడుతూ గేమ్ ఆడిస్తూ ఉన్నాడు.

కానీ ప్రేక్షకులు మాత్రం ఈ షో పట్ల అంత ఆసక్తి కనబరచడం లేదట.ఎన్టీఆర్ మ్యానియా కూడా ఈ షో కు రేటింగ్ తీసుకు రాలేకపోతుంది.మరి ముందు ముందు అయినా జెమిని టీవీ వారు ఈ షో ను బాగా ప్రోమోట్ చేసి సక్సెస్ చేస్తారో లేదో వేచి చూడాలి.ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ జక్కన్న దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూట్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసాడు.