మనుషుల తర్వాత తెలివైన జంతువు ఏదైనా ఉందా అంటే అది కోతి అనే చెప్పక తప్పదేమో.ఎందుకంటే మనిషి కూడా కోతి రూపం నుంచి వచ్చాడని చరిత్ర చెబుతోంది.
మరి అలాంటప్పుడు కోతికి కూడా కొన్ని మనిషి లక్షనాలు ఉండటం చాలా కామన్ కదా.ఇక ఇలంటి కోతుల చేష్టలకు సంబంధించిన వీడియోలు గానీ లేదంటే ఫొటోలు నిత్యం సోషల్ మీడియా యుగంలో ట్రెండింగ్‌లో నిలుస్తుంది.
కోతులు ఇలా కూడా చేస్తాయా అనే విధంగా అందులో కోతులు చిలిపి పనులు చేయడాన్ని మనం చూడొచ్చు.ఇకి ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది.
వాస్తవానికి సోషల్ మీడియా అంటేనే ఓ వీడియో ట్రెండింగ్‌లో ఉండగానే దాన్ని కొట్టేసి మరీ మరో వీడియో హైలెట్ అయిపోతుంది.ఇకపోతే ఇప్పుడున్న స్మార్ట్ ప్రపంచంలో ఎన్నెన్నో ప్రత్యేక అంశాలు నిత్యం మనకు దర్శనిమిస్తూన ఉంటాయి.
మన కండ్లు కూడా నమ్మలేనటువంటి వీడియోలు మనకు కనిపిస్తుంటాయి.మరీ ముఖ్యంగా పెళ్లిళ్లు లేదంటే అడవి జంతువులు లేదంటే భార్యా భర్తల నడుమ వచ్చే సరదాల్లాంటివి ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి.
ఇక ఇప్పుడు కూడా ఓ అడవి జంతువుకు సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతుంది.
ఇందులో రెండు చింపాంజీలు చేస్తున్న పని నిజంగానే వావ్ అనిపించేలా ఉంది.
అదేంటంటే ఇందులో రెండు చింపాంజీలు కూడా డ్రోన్ ఎగురవేస్తున్నట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.ఇందులో చూస్తే గనక ఓ చింపాంజీ డ్రోన్‌కు సంబంధించిన రిమోట్ కంట్రోల్‌ని అచ్చం మనుషులు పట్టుకున్నట్టు కనిపిస్తుంది.
ఇక దానికి తోడుగా మరో చింపాంజీ కూడా రంగంలోకి దిగి ఆ చింపాంజీని అనుకరిస్తుంది.ఇక ఇవి రెండు కలిసి డ్రోన్‌ను చాలా సీరియస్‌గా ఎగురవేస్తున్నట్లు యాక్టింగ్ చేయడాన్ని మనం ఇందులో చూడొచ్చు.
దీన్ని బట్టి చింపాంజీలు కూడా మనుషుల లాగానే చాలా పనులు చేయగలవని తెలుస్తోంది.