టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాని తాజాగా నటించిన చిత్రం దసరా.
ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ఈ సినిమాతో శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
ఇందులో నాని సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఇప్పటివరకు నాని ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాగే లవ్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.మొదటిసారిగా నాని ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు.దీంతో ఈ సినిమా అసలు కథ ఏమిటి ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి.
దీంతో అసలు కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ చెక్కర్లు కొడుతోంది.కాగా ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల కాగా అందులో సిల్క్ స్మిత ఫోటోని ఉపయోగించిన విషయం తెలిసిందే.

దీంతో అనేక రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పీరియాడికల్ స్టోరీగా అప్పటి సన్నివేశాలను ఏదైనా చూపించబోతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక స్టోరీ వైరల్ అవుతోంది.ఇది ఓ సిల్క్ స్మిత పేరుతో ఉన్న ఓ బార్ రెస్టారెంట్ కేంద్రంగా సినిమా సాగుతుందట.
అందులో నానితోపాటు మరో గ్యాంగ్ కూడా రెగ్యూలర్గా వచ్చిపోతుంటారని,అయితే అందులో వీరి రెండు గ్రూపులకు మధ్య గొడవ జరుగుతుందని, దీనికి కారణంగా అంతా రెండుగా విడిపోయి కొట్టుకుంటుంటారని, మరి ఆ గొడవేంటి? ఎందుకు గొడవ పడ్డారు, అందులో స్కిల్ స్మిత్ హోటల్ పాత్ర ఏంటి? నాని ఏం చేశాడనేది కథగా ఉండబోతుందని తెలుస్తుంది.