తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో తెలుగుదేశం కార్యకర్తలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.ముందుగా ఆస్పత్రికి వెళ్లిన ఆయన కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనపర్తిలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు.
ఈ క్రమంలో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
అనంతరం అక్రమ కేసులపై న్యాయబద్ధంగా పోరాడుదామని చంద్రబాబు తెలిపారు.