లీకైన దసరా స్టోరీ.. సిల్క్ స్మిత పోస్టర్ కు ఈ సినిమాకు లింక్ ఏంటంటే?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాని తాజాగా నటించిన చిత్రం దసరా.

ఈ సినిమాలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ఈ సినిమాతో శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

ఇందులో నాని సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

"""/"/ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఇప్పటివరకు నాని ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాగే లవ్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

మొదటిసారిగా నాని ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు.దీంతో ఈ సినిమా అసలు కథ ఏమిటి ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

దీంతో అసలు కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ చెక్కర్లు కొడుతోంది.

కాగా ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల కాగా అందులో సిల్క్ స్మిత ఫోటోని ఉపయోగించిన విషయం తెలిసిందే.

"""/"/ దీంతో అనేక రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పీరియాడికల్‌ స్టోరీగా అప్పటి సన్నివేశాలను ఏదైనా చూపించబోతున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక స్టోరీ వైరల్ అవుతోంది.ఇది ఓ సిల్క్ స్మిత పేరుతో ఉన్న ఓ బార్‌ రెస్టారెంట్‌ కేంద్రంగా సినిమా సాగుతుందట.

అందులో నానితోపాటు మరో గ్యాంగ్‌ కూడా రెగ్యూలర్‌గా వచ్చిపోతుంటారని,అయితే అందులో వీరి రెండు గ్రూపులకు మధ్య గొడవ జరుగుతుందని, దీనికి కారణంగా అంతా రెండుగా విడిపోయి కొట్టుకుంటుంటారని, మరి ఆ గొడవేంటి? ఎందుకు గొడవ పడ్డారు, అందులో స్కిల్ స్మిత్‌ హోటల్‌ పాత్ర ఏంటి? నాని ఏం చేశాడనేది కథగా ఉండబోతుందని తెలుస్తుంది.

డైరెక్టర్ ని చూడటానికి వెళ్లి హీరోయిన్ గా అయిపోయింది … ఎలాగో తెలుసా?