తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్న సామెత రాజకీయాల్లో సర్వ సాధారణంగా కనిపించేదే.తమకు రాజకీయంగా పనికి వస్తారు… కలిసివస్తారు అనుకుంటే… చేరదీయడం .
లేకపోతే ఆమడ దూరం పెట్టడం ఇక్కడ షరా మాములే.ఇలాంటి విషయాల్లో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుది అందివేసిన చేయి.
గతంలో ఈ మాదిరిగానే… జూనియర్ ఎన్టీఆర్ను తన రాజకీయ అవసరాలకోసం వాడుకొని అవసరం తీరాక దూరం పెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు.దీంతో అప్పట్లో బాబు తీరుపై జూనియర్ ఎన్టీఆర్ తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసాడు.
ఇప్పుడు టీడీపీ కి రహకీయంగా కష్టకాలం రావడంతో జూనియర్ కి గేలం వేసేందుకు బాబు మాస్టర్ ప్లాన్ వేసాడు.
ఆగా… మహాకూటమిలో భాగంగా కూకట్ పల్లి సీటు టీడీపీ దక్కించుకుంది.ఇక అక్కడ నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె… సుహాసినిని బరిలోకి దింపారు.దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె తరుపున ప్రచారానికి ఆమె అన్నలు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని బాబు మాస్టర్ ప్లాన్ వేసాడు.అయితే ఎప్పుడూ బాబు ఎత్తులే వర్కవుట్ కావు కదా ! ఎన్నికల ప్రచారం విషయంలో బాబుకు ఎన్టీఆర్ షాక్ ఇచ్చారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
హరి కృష్ణ కుమార్తె సుహాసిని పేరు పైకి వచ్చిన తరువాత నుంచి అధికారికంగా ప్రకటించే వరకు ఒక్కటంటే ఒక్క ఫోన్ కాలు చంద్రబాబు నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ కీలక బాధ్యుల నుంచి కానీ హరికృష్ణ కుటుంబసభ్యులు ఎవరికీ రాకపోవడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
కేవలం నేరుగా సుహాసినిని, ఆమె దగ్గర వారు మరి కొందరిని సంప్రదించి బాబు ఈ నిర్ణయానికి వారిని ఒప్పించినట్లు తెలుస్తోంది.చంధ్రబాబు ఇలా చేయడం వల్ల హరికృష్ణ కుటుంబ సభ్యులు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ పైకి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు.
కానీ బాబు చేసిన ఈ రాజకీయం పై మాత్రం లోలోపల రగిలిపోతున్నారట.అంతే కాదు బాబు చేసిన ఈ మోసానికి అసలు వారు తమ సోదరి తరపున ఎన్నికల ప్రచారానికి వస్తారా అనే సందేహం అందరిలోనూ… వ్యక్తం అవుతోంది.
ఈ విషయంలో జూనియర్ మాత్రం తొందరపడి ఎన్నికల ప్రచారానికి వెళ్లి బాబు చేతిలో మరోసారి మోసపోకూడదు అనే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.