సరికొత్త బాటలో నడిచేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు.ఇప్పటి వరకు తను తండ్రి చంద్రబాబు ఇమేజ్ తోనే రాజకీయం చేస్తున్నారు.
సొంతంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందలేకపోయారు.అటు తెలుగుదేశం పార్టీ కేడర్ లోనూ బలమైన వ్యక్తిగా ముద్ర వేయించుకోలేకపోయారు.
పార్టీ తరఫున ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎంత యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్న, తనకు రావాల్సిన క్రెడిట్ దక్కడం లేదనే బాధ చాలాకాలంగా లోకేష్ లో ఉంది.దీనికి తోడు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చెందడం, స్వయంగా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ఘోర పరాజయం పాలవడం వంటిది లోకేష్ కు ఇబ్బందికరంగా మారాయి.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు లోకేష్ తీసుకున్నా, అక్కడా ఓటమే ఎదురవడం, ఇటువంటివి ఎన్నో లోకేష్ ను దెబ్బతీశాయి.
ఇక పార్టీ సీనియర్ల లో లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందలేకపోయారు.
ఇవన్నీ లోకేష్ రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా మారాయి.అయితే తనపై ఉన్న ముద్రను పూర్తిగా జరుపుకోవాలని, జగన్ మాదిరిగా ఏపీ లో బలమైన నాయకుడుగా ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తపనతో లోకేష్ ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.
అసలు జగన్ కు ప్రజల్లో ఆదరణ పెరగడానికి కారణం ఆయన తరుచూ ప్రజల్లోనే ఉంటూ, ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ రావడం, పాదయాత్ర ద్వారా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకోవడం ఇవన్నీ లోకేష్ ఇప్పుడు స్ఫూర్తిగా తీసుకోబోతున్నారట.

తాను కూడా ఇక సోషల్ మీడియాలో కంటే, జనాల్లోనే యాక్టివ్ గా ఉంటూ రాజకీయ పోరాటాలు చేయాలని, అలాగే ఏపీలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయించి, వాటిని తానే ప్రారంభిస్తూ, అటు నందమూరి అభిమానుల మద్దతుతో పాటు, జనాల్లో తనకు ఆదరణ పెరిగే విధంగా చేసుకోవాలనే వ్యూహంతో లోకేష్ ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది.ఏపీలో రాజకీయ పోరాటం మొదలు పెట్టడంతో పాటు, పెద్ద ఎత్తున ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయించే దిశగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.