ఆశ్చర్యంగా అనిపించినా.ఇది నిజమే! ఎన్నో ఆశలతో.
పదవులపై వ్యామోహంతో వైకాపా అధినేత జగన్ పుట్టిముంచి మరీ చంద్రబాబు చెంతకు చేరిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి.దాదాపు పార్టీ ఫిరాయించి మూడు మాసాలకు పైగా అయింది.
అయినప్పటికీ.జెండా మార్చేసిన సయమంలో వీరికి బాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదు.
దీనికితోడు చాలా మంది ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాల్లోని టీడీపీ ఇన్‌చార్జ్‌ల నుంచి పెద్ద ఎత్తున అవమానాలు ఎదురవుతున్నాయి.మరోపక్క, నిన్నటికి నిన్న హైకోర్టు వీళ్లందరికీ పెద్ద ఎత్తున షాక్ ఇస్తూ.
నోటీసులు జారీ చేసింది.దీంతో వీరి పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది.
ప్రకాశం జిల్లాలో పరిస్థితిని గమనిస్తే.ఇక్కడి వైకాపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కి.
అప్పటికే ఉన్న కరణం బలరాంతో ఎంత మాత్రమూ పొసగడం లేదు.ఇక, కర్నూలు జిల్లా పరిస్థితి మరింత దారుణం.
ఇక్కడ ఎప్పటి నుంచో ఉప్పు నిప్పులా ఉన్న శిల్పా బ్రదర్స్ చక్రపాణి, మోహన్ రెడ్డిలకు, వైకాపా నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి వర్గానికి మధ్య పొసిగే పరిస్థితి లేదు.అయితే, పదవుల ఆశ, చంద్రబాబు ఆకర్ష్ దెబ్బకి.
తన కుమార్తె అఖిలతో సహా నాగిరెడ్డి వచ్చి టీడీపీలో చేరారు.అప్పట్లో పెద్ద ఎత్తున ఇరు పక్షాలతోనూ మాట్లాడిన చంద్రబాబు సర్దుకుపోవాలని సూచించారు.
ముందు ఓకే అన్నా ప్రతి పది, పదిహేను రోజులకు ఏదో ఒక విషయంలో ఘర్షణలు తలెత్తుతున్నాయి.
ఇప్పుడు తాజాగా.
వైకాపా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే, ఆయనకు ఇప్పుడు నియోజకవర్గంలో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయట.
ఈ నెల 1 టీడీపీ జన చైతన్య యాత్ర పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఈ క్రమంలో కదిరి మండలం బూరుగు పల్లి కి వెళ్లిన చాంద్ బాషాకి పెద్ద ఎత్తున అవమానం జరిగింది.
స్థానికులు ఆయన ప్రశ్నలు సంధించారు.‘ఒక పార్టీ సింబల్‌తో గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన మీరా మమ్మల్ని చైతన్యం చేసేది? మీలాంటి వారికి మా గ్రామంలోకి అనుమతి లేదు’ అంటూ ఫ్లెక్సీ ద్వారా తమ నిరసనను తెలిపారు.
ఈ హఠాత్ పరిణామంతో ఉలిక్కిపడ్డ చాంద్‌కి.ఏం చేయాలో కూడా తెలియలేదట.‘ఓట్లేసి గెలిపించిన ప్రజలను మీరు మోసగించారు.డబ్బుకు కక్కుర్తి పడి మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు.
జన చైతన్య యాత్రల పేరుతో మీరు జనాన్ని చైతన్యం చేయడమేంటి? ప్రజలను మోసగించిన మీ లాంటి వారిని మా గ్రామంలోకి అనుమతించం’ అంటూ గొడ్డువెలగల గ్రామ ప్రజల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ పరిణామం చాంద్‌ని దిమ్మతిరిగేలా చేసిందట! ఈ క్రమంలో ఆయన పోలీసులను ఆశ్రయించారట.
దీంతో పోలీసులు యాత్ర జరిగే గ్రామాలకు ముందుగానే వెళ్లి.అక్కడి ఫ్లెక్సీలను తొలగించాకే చాంద్ పర్యటిస్తున్నారట.
ఏదేమైనా.ఏదో ఊహించుకుని టీడీపీలోకి వెళ్తే.
ఏదో జరుగుతోందేమిటి? అని వాళ్లు వాపోతున్నారట!!
.