ఏపీ చరిత్రలో ఇలాంటి క్యాబినెట్ కూర్పు ఎప్పుడూ లేదని వైసీపీ చెబుతోంది.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చామని ఆ పార్టీ నేతలు ఊదరకొడుతున్నారు.
అద్భుతమైన సామాజిక న్యాయం చేశారని జగన్ క్యాబినెట్ ను చూసిన వాళ్లు విశ్లేషణలను ఇస్తున్నారు.మంత్రివర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పేర్లను నిశితంగా పరిశీలిస్తే వాళ్లంతా దాదాపు కుబేరులు.
అలాంటి వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రన సామాజిక న్యాయం జరిగిపోయినట్టేనా? అనేది ఆలోచించాలి.
రెడ్డి, కాపు, బీసీ సామాజికవర్గంలోని మంత్రులను మరొకరితో రీప్లేస్ చేశారు.
ఎస్సీల్లోని కుబేరులను జగన్ ఎంపిక చేసుకున్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి సురేష్ ను కొనగించారు.
అంటే, ఆయన బంధువర్గంలో ఆయనతో పాటు ఐఆర్ఎస్, ఐఏఎస్ అధికారులు సుమారు 11 మంది ఉన్నారని తెలుస్తోంది.పైగా ఆయన సతీమణి ఆదాయ పన్నులశాఖలో కీలక అధికారిణిగా పనిచేస్తున్నారు.
అందుకే, బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత ఒత్తిడి చేసినప్పటికీ సురేష్ ను కొనసాగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.పైకి మాత్రం ఆయన బంధువు అయినప్పటికీ బాలినేని మంత్రి పదవిని కట్ చేసి ఎస్సీ సురేష్ కు కొనసాగింపు ఇచ్చినట్టు ఫోకస్ అవుతోంది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన విడదల రజిని బీసీ సామాజికవర్గం.

ఆమెకు మంత్రి పదవి ఇచ్చామని గొప్పగా జగన్ టీమ్ చెబుతోంది.పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ ఆమె.దాదాపు రెండు వేల కోట్లకు పైగా ఆమె సంపద ఉందని వైసీపీ వర్గాల్లోని టాక్.ఇటీవల ఒక కంపెనీ విక్రయించడం ద్వారా వేల కోట్లు వచ్చాయని, ఆ డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టగా ఆ మొత్తం డబుల్ అయిందని ప్రచారం జరుగుతోంది.బీసీల్లో కుబేరురాలిగా ఆమెకు పేరుంది.
మరో బీసీ నేత జోగి రమేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్థికంగా బాగా ఉన్నాడని రాజకీయ వర్గాలకు తెలుసు.ఆయన్ను ఇప్పుడు మంత్రివర్గంలోకి జగన్ తీసుకున్నారు.
ఇక కారమూరి నాగేశ్వరరావు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జడ్పీ చైర్మన్ నుంచి ఆర్థికంగా బాగా ఎదిగారు.వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉంటూ ప్రస్తుతం జగన్ సర్కార్ లో రెండేళ్లుగా అనూహ్యంగా సంపాదించారని ఆ పార్టీలోని ప్రత్యర్థి వర్గం చర్చించుకుంటోంది.

ఉషశ్రీ చరణ్ ఉన్నత విద్యాధికురాలే కాకుండా కర్ణాటక రాష్ట్రం మూలాలు ఉన్నాయి.అక్కడ పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తుంటారని టాక్.ఇదే కోవలో మరో ఎస్సీ మంత్రి నారాయణస్వామి. 1983లో చిత్తూరు జిల్లా కార్వేటినగరం సర్పంచ్ గా రాజకీయాల్లోకి ప్రవేశించి 2004 నాటికి సత్యవేడు నుంచి ఎమ్మెల్యే అయ్యారు.2009లో ఓడినా తిరిగి 2014 నాటికి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.జగన్ కేబినెట్లో రెండోసారి మంత్రి అయ్యారు.
ఆయన సంపాదన గురించి ఆ జిల్లాలకు చెందిన లీడర్లు కథలు కథలుగా చెప్పుకుంటారు.తూగో జిల్లా అమలాపురానికి చెందిన విశ్వరూప్ కు 1987లోనే కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
తొలుత ఓటములు పలకరించినా 2004లో వైఎస్ హయాంలో విశ్వరూప్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.ఆనాటి నుంచి ఆర్థికంగా బాగా ఎదిగారని స్థానికులకు తెలియని అంశం కాదు.

వైఎస్, రోశయ్య, కిరణ్ మంత్రివర్గాల్లో పనిచేశారు.ఆ తర్వాత వైసీపీలో చేరి 2014, 19 ఎన్నికల్లో గెలిచి జగన్ కేబినెట్లో రెండుసార్లు మంత్రి అయ్యారు.ఇదే కోవలో తానేటి వనిత తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చి తొలుత టీడీపీలో ఉన్నారు.ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 నుంచి వరుసగా గెలుస్తున్నారు.ఆమెకు జగన్ రెండు కేబినెట్లలోనూ చోటు దక్కింది.ఆర్థికంగా బాగా సౌండ్.
ఎస్టీ కోటాలో రాజన్నదొరను క్యాబినెట్ లోని జగన్ తీసుకున్నారు.అందరూ శభాష్ అనుకుంటూ ప్రశంసిస్తున్నారు.
కానీ, ఆయన చేస్తోన్న వ్యాపారాలు, సంపాదన గురించి తెలిసిన వాళ్ల మాత్రం ఎస్టీల్లో కుబేరునిగా ఆయన్ను చెప్పుకుంటారు.ఎస్సీల్లోని మేరుగ నాగార్జున గురించి సర్వత్రా తెలిసిన కుబేరుడే.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని కుబేరులకు జగన్ పెద్దపీఠ వేశారని అర్థం అవుతోంది.







