కోలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయనకు తమిళంతో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈయన నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్నాయి.ఇలా తమిళ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న శింబు ప్రస్తుతం హీరోగా మాత్రమే కాకుండా బుల్లితెర వ్యాఖ్యాతగా మారిపోయారు.
తాజాగా ఆయన బిగ్ బాస్ తమిళ ఓటీటీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు.
ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్న శింబు ఉన్నఫలంగా ఆటో డ్రైవర్ గా మారిపోయారు.
ఇలా శింబు ఆటోడ్రైవర్ గా మారడానికి గల కారణం ఏమిటి? ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం ఇలా ఆటోడ్రైవర్ గా మారిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మరి శింబు ఉన్నఫలంగా ఇలా ఆటోడ్రైవర్ గా మారిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

కోలీవుడ్ సమాచారం ప్రకారం శింబు త్వరలోనే ఒక డిజిటల్ మీడియా కోసం వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి శింబు సిద్ధమైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పనులను జరుపుకుంటోంది.
ఇందులో నటుడు శింబు ఆటోడ్రైవర్ గా కనిపించబోతున్నారని కోలీవుడ్ సమాచారం.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుండగా శింబు ఆటో నడుపుతూ కనిపించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







