అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొలువులో భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ లిస్ట్ భారీగా పెరిగిపోగా… విమర్శలు వస్తున్నప్పటికీ బైడెన్ వెనక్కి తగ్గడం లేదు.
తాజాగా జో బైడెన్ కొలువులో మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు దక్కాయి.భారతీయ అమెరికన్ దౌత్యవేత్త రచనా సచ్‌దేవా కొర్హోనెన్‌ను మాలిలో యూఎస్ రాయబారిగా నియమించారు బైడెన్.
ఈ మేరకు వైట్‌హౌస్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.రచనా.
ఇంతకుముందు సౌదీ అరేబియాలోని ధరన్‌లోని యూఎస్ కాన్సులేట్‌లో కాన్సుల్ జనరల్ అండ్ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా పనిచేశారు.
అలాగే కొలంబోలోని అమెరికన్ ఎంబసీలో నిర్వహణ విభాగం హెడ్‌గా పనిచేశారు.
యూఎస్ ఫారిన్ సర్వీస్‌లో సభ్యురాలైన రచన ప్రస్తుతం బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ సంయుక్త కార్యనిర్వాహక కార్యాలయాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్‌లో రచనా సచ్‌దేవా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

కొద్దిరోజుల క్రితం ఇండో అమెరికన్ దౌత్యవేత్త పునీత్ తల్వార్‌ను మొరాకోకు అమెరికా రాయబారిగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ సలహాదారుగా ఉన్న తల్వార్.వైట్‌హౌస్, సెనేట్‌లో జాతీయ భద్రత ,విదేశాంగ విధానానికి సంబంధించి పలు హోదాల్లో పనిచేశారు.అలాగే భారత సంతతికే చెందిన రాజకీయ కార్యకర్త షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా జో బైడెన్ నామినేట్ చేశారు.
కాశ్మీర్ నుంచి యూఎస్‌కి వలస వచ్చిన దుగ్గల్ (50) సిన్సినాటీ, చికాగో, న్యూయార్క్, బోస్టన్‌లలో పెరిగారు.కొద్దిరోజుల వ్యవధిలోనే మూడు దేశాలకు ముగ్గురు భారత సంతతి దౌత్యవేత్తలను బైడెన్ రాయబారులుగా నియమించారు.







