డిసెంబర్ నెలలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్ మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.
ఇప్పటికే ఆప్ ప్రచారంలో దూసుకుపోతోంది.మరోవైపు కాంగ్రెస్ కూడా రాణిస్తూ ఉంది.
ఈ క్రమంలో తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
విషయంలోకి వెళ్తే మోడీ పాలన గురించి ఓ చిన్న పిల్ల మాట్లాడటం జరిగింది.
ఆ వీడియోని బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడంతో…ఇది చట్ట ఉల్లంఘన అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.ఎన్నికల కమిషన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరింది.
కాగా తన పరిపాలన గురించి పొగుడుతూ ప్రచారం చేస్తున్న సదరు బాలికను ఇటీవల మోడీ అభినందించడం జరిగింది.డిసెంబర్ లో రెండు దఫాలుగా జరగనున్న ఈ ఎన్నికలలో అధికారం చేజారిపోకుండా బీజేపీ తీవ్ర స్థాయిలో కృషి చేస్తోంది.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సంచలన హామీలు ప్రకటిస్తుంది.







