Silicon Andhra University : అమెరికా : సిలికానాంధ్ర కు మరో అరుదైన గుర్తింపు...ఇకపై

అమెరికాలోని ఎలాంటి లాభాపేక్ష లేకుండా భారతీయ కళలు, తెలుగు బాష సంస్కృతం, నేర్చుకోవడానికి ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయం సిలికానాంధ్ర వర్సిటీ.అమెరికాలోని కాలిఫోర్నియా లో మిల్పిటాస్ నగరంలో స్థాపించబడిన ఈ వర్సిటీ ప్రస్తుతం ఎన్నో సేవలు అందిస్తోంది ముఖ్యంగా భారతీయ కళలు , బాషలపై అక్కడి భారత సంతతి పిల్లలకు విదేశీయులకు అవగాహన కల్పిస్తూ వారిని ప్రావీణ్యులుగా తీర్చి దిద్దుతోంది.

 Silicon Andhra University Gets Wscuc Permission To Start Computer Classes,silico-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక్కోక్క మెయిలు రాయిని దాటుతూ తన గమ్యాన్ని, ఆశయాలను చేరుకుంటోంది.తాజాగా

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా త్వరలో కంప్యూటర్ సైన్స్ లో ఏంఎస్ తరగతులు ప్రారంభించేందుకు సిద్దమవుతోంది.

ఈ మేరకు అమెరికా WSCUC నుంచీ అనుమతులు లభించాయని ప్రకటించింది.త్వరలో అంటే 2023 విద్యా సంవత్సరం నుంచీ తరగతులకు అడ్మిషన్స్ తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టుగా వర్సిటీ యంత్రాంగం ప్రకటించింది.ఇదిలాఉంటే

Telugu America, Classes, Indians, Machine, Silicon Andhra, Wscuc-Telugu NRI

ఈ కోర్సుకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది, ఎంతో మంది భారతీయులు భారత్ నుంచీ అమెరికాకు ఈ కోర్సును నేర్చుకునేందుకు వస్తుంటారు కూడా.ఈ కోర్సు ద్వారా విద్యార్ధులు అత్యాధునిక సాంకేతిక విద్యా కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెషిన్ ట్రాన్స్ లేషన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటివి నేర్చుకోవచ్చు.2017 లో స్థాపించబడిన ఈ వర్సిటీ కి కొద్ది కాలంలోనే WASC గుర్తింపు లభించిందని, అయితే ఎంతో మంది సహకారంతో ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ కోర్సు కు అనుమతులు లభించాయని, ఇందుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు వర్సిటీ నిర్వాహకులు.భవిష్యత్తులో మరిన్ని కోర్సులు ఈ విశ్వవిద్యాలయం ద్వారా అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

సిలికానాంధ్ర లో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదివేందుకు అనుమతులు రావడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుగు ప్రవాసులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube