ఆప్ నేత సత్యేంద్ర జైన్ కు తీహార్ జైలులో మసాజ్ చేసిన వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది.సత్యేంద్ర జైన్ కు మసాజ్ చేసిన వ్యక్తి ఖైదీ రింకుగా గుర్తించారు.
రేప్ కేసులో రింకు శిక్ష అనుభవిస్తున్నాడని అధికారులు తెలిపారు.కాగా రింకుపై పోక్సో చట్టం సహా ఐపీసీ 376, 506, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
అయితే సత్యేంద్ర జైన్ కు మసాజ్ చేసింది ఫిజియోథెరపిస్ట్ అని, వైద్యుల సూచనల మేరకే మసాజ్ చేయించుకుంటున్నారని ఆప్ వాదిస్తున్నట్లుగా సమాచారం.