అమెరికా : సిలికానాంధ్ర కు మరో అరుదైన గుర్తింపు…ఇకపై

అమెరికాలోని ఎలాంటి లాభాపేక్ష లేకుండా భారతీయ కళలు, తెలుగు బాష సంస్కృతం, నేర్చుకోవడానికి ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయం సిలికానాంధ్ర వర్సిటీ.

అమెరికాలోని కాలిఫోర్నియా లో మిల్పిటాస్ నగరంలో స్థాపించబడిన ఈ వర్సిటీ ప్రస్తుతం ఎన్నో సేవలు అందిస్తోంది ముఖ్యంగా భారతీయ కళలు , బాషలపై అక్కడి భారత సంతతి పిల్లలకు విదేశీయులకు అవగాహన కల్పిస్తూ వారిని ప్రావీణ్యులుగా తీర్చి దిద్దుతోంది.

ఈ క్రమంలోనే ఒక్కోక్క మెయిలు రాయిని దాటుతూ తన గమ్యాన్ని, ఆశయాలను చేరుకుంటోంది.

తాజాగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా త్వరలో కంప్యూటర్ సైన్స్ లో ఏంఎస్ తరగతులు ప్రారంభించేందుకు సిద్దమవుతోంది.

ఈ మేరకు అమెరికా WSCUC నుంచీ అనుమతులు లభించాయని ప్రకటించింది.త్వరలో అంటే 2023 విద్యా సంవత్సరం నుంచీ తరగతులకు అడ్మిషన్స్ తీసుకునే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టుగా వర్సిటీ యంత్రాంగం ప్రకటించింది.

ఇదిలాఉంటే """/"/ ఈ కోర్సుకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది, ఎంతో మంది భారతీయులు భారత్ నుంచీ అమెరికాకు ఈ కోర్సును నేర్చుకునేందుకు వస్తుంటారు కూడా.

ఈ కోర్సు ద్వారా విద్యార్ధులు అత్యాధునిక సాంకేతిక విద్యా కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెషిన్ ట్రాన్స్ లేషన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటివి నేర్చుకోవచ్చు.

2017 లో స్థాపించబడిన ఈ వర్సిటీ కి కొద్ది కాలంలోనే WASC గుర్తింపు లభించిందని, అయితే ఎంతో మంది సహకారంతో ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ కోర్సు కు అనుమతులు లభించాయని, ఇందుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు వర్సిటీ నిర్వాహకులు.

భవిష్యత్తులో మరిన్ని కోర్సులు ఈ విశ్వవిద్యాలయం ద్వారా అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

సిలికానాంధ్ర లో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదివేందుకు అనుమతులు రావడం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుగు ప్రవాసులు.

పవన్ ట్వీట్ కు తారక్ అందుకే రిప్లై ఇవ్వలేదా.. ఆ రీజన్ వల్లే సైలెంట్ అయ్యారా?