రాహుల్ గాంధీ పాల్గొన్న రైతు సంఘర్షణ సభసభ సక్సెస్ రావడంతో టీ కాంగ్రెస్ నూతన ఉత్సాహంతో ఉంది.ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓరుగల్లు ఖిల్లా వరంగల్ లో రాహుల్ గాంధీ సభకు ఐక్యంగా పనిచేయడంతో రాహుల్ సభ అ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలంగాణలో రాహుల్ పర్యటనను ఖరారు చేసింది.
రాహుల్ పర్యటన సందర్భంగా వరంగల్ చుట్టుపక్కల గల జిల్లాల్లో రాహుల్ బహిరంగ సభ సందర్భంగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఇ రాహుల్గాంధీ సభను విజయవంతం చేశారు.
రాహుల్ గాంధీ సభ ను టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి వి హనుమంత రావు, మధుయాష్కిగౌడ్, దామోదర రాజనర్సింహ, గీతా రెడ్డి, పొన్నం ప్రభాకర్ లతోపాటు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు లతో పాటు కాంగ్రెస్ పార్టీ బాధ్యులు సభను విజయవంతం చేసేందుకు ముక్తకంఠంతో ఏకమై రాహుల్ సభ విజయవంతానికి పనిచేశారు.
వరంగల్ సభ విజయవంతంతో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి నాంది పలికే విధంగా ముందుకు సాగాలని కాంగ్రెస్ శ్రేణులు వెళ్ళుతున్నారు.
మొదటిరోజు రాహుల్ గాంధీ సభలో ఊహించినదానికంటే ప్రజలు అధికంగా హాజరుకావడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్సాహంతో ప్రసంగించారు.ఎంతోమంది మేధావులు ఆలోచనలతో 1200 పైగా బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ కంపెనీలా మారుస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాచరిక పాలన కేసీఆర్ కొనసాగిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులను మోసం చేసిందని విమర్శించారు.వరంగల్ డిక్లరేషన్ గా పేర్కొంటూ అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఒక్క అవకాశం ఇవ్వండి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ప్రకటించారు.
పనిలో పనిగా రాహుల్ గాంధీ కేంద్రంలోని ఇండియన్ రాష్ట్రంలోని తెరాసను విమర్శిస్తూ భాజపా చేతిలో టిఆర్ఎస్ రిమోట్ లో వ్యవహరిస్తోందని అన్నారు ఈ రెండు పార్టీల రహస్య ఒప్పందం వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి పై సిబిఐ విచారణ చేయడం లేదని విమర్శించారు.మొత్తానికి రాహుల్ గాంధీ సభ సక్సెస్ కావడంతో రెండో రోజు రాహుల్ గాంధీ హైదరాబాద్ లో పర్యటించారు.
ప్రతిష్టాత్మక తెలంగాణ ఉద్యమ క్షేత్రమైన ఉస్మానియా యూనివర్సిటీని రాహుల్ గాంధీ సందర్శించాలని ఉండగా అనుమతి ఇవ్వలేదు.

రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి రాకుండా అనుమతి ఇవ్వకపోవడం నిరసిస్తూ ఎన్.ఎస్.యు.ఐ బల్మూర్ వెంకట తో పాటు మరో 17 మంది నాయకులను అరెస్టు చేసి రిమాండ్ తరలించగా బెయిల్ నిరాకరించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.ఎన్ ఎస్ వి నాయకులను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు 60 మంది దరఖాస్తు చేసుకోగా శాఖ అధికారులు కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతించారు.
రెండో రోజు పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తో పాటు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క లు చెంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్.ఎస్.యు.ఐ నాయకులను ములాఖాత్ అయ్యారు.ఇదిలా ఉండగా జాతీయ పార్టీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లకుండా అనుమతి నిరాకరించడం పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ కి వెళ్లే అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఇక ఇప్పటి నుండి భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.నియంతృత్వ ధోరణితో కెసిఆర్ ప్రభుత్వం జాతీయ స్థాయి నాయకులను సైతం అవమానపరిచే విధంగా ఇస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, టీ కాంగ్రెస్ ఎలక్షన్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.ఫ్రంట్ ల పేరుతో దేశవ్యాప్తంగా గా పర్యటిస్తానని కెసిఆర్ ప్రకటించి, తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ కి వెళ్లడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ పై ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అందుకే ఆయనకు యూనివర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు.ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశంలో కొన్నారు.
వరంగల్ వేదికగానే రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండే ప్రసక్తే లేదని ప్రకటించారు టీఆర్ఎస్ పై యుద్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న వారికే రాబోయే ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తామని ప్రకటించారు.
అసమ్మతి వినిపించే నాయకులు ఎంత పెద్ద వారైనా ఉపేక్షించే ప్రసక్తేలేదని ప్రకటించారు.కాంగ్రెస్ పార్టీ కుటుంబం లాంటిదని ఎలాంటి సమస్యలు ఉన్నా అంతర్గతంగా మాట్లాడాలి కానీ మీడియాకు ఎక్కి బహిర్గతం కాకూడదు అన్నారు.
పార్టీ అధికారంలోకి రావాలంటే హైదరాబాద్ ను వదిలి నియోజకవర్గాల్లో పనిచేయాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ నష్టపోయినప్పటికీ ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు.
ఉన్న విద్యార్థులు మేధావులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని అని ఆహ్వానించారు.రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మరింత బలోపేతం కోసం నిర్దేశం దిశానిర్దేశం ఎంతవరకు ఫలిస్తుందో భవిష్యత్తే నిర్ణయిస్తుంది.







