కాపు ప్రకటన తో తమా పార్టీ వైకిరి ఏంటి అనేది స్పష్టం చేసిన జగన్ కు ఇప్పటికీ ఆ కాక తగులుతోనే ఉంది.కాపుల సామ్రాజ్యంగా పేరు ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్ కు ఆ సెగ తగులుతూనే ఉంది.
జగన్ పాదయాత్రకు తూర్పు గోదావరి జిల్లాలోఅడ్డంకులు ఎదురయ్యాయి.కాపు వర్గం నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని అంశం చెప్పిన జగన్‌కు ఆ వర్గం నుంచి ఊహించని రీతిలో నిరసన ఎదురైంది.కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిలో మార్పు రాకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ కావాలని చేఇసినా, పొరపాటున చేసినా … ఆయన గొప్ప సాహసమే చేసాడు.ఎందుకంటే కాపు సామజిక వర్గం ఎక్కువగా ఉండే తూర్పుగోదావరిలో అందునా ముద్రగడ సొంత నియోజకవర్గం అయిన జగ్గం పేటలో కాపు రిజర్వేషన్ అంశాన్ని జగన్ టచ్ చేసాడు.దాని ఎఫెక్ట్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా దాటే వరకు వదిలేలా కనిపించడం లేదు.జగన్ పాదయాత్రలో అడుగడుగునా కాపు నాయకులు ఆయనకు తమ నిరసనను తెలియజేస్తున్నారు.

కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిని నిరసిస్తూ పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో కాపు యువకులు ఈ రోజు జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు.ప్లకార్డులు, నల్లజెండాలు ప్రదర్శిస్తూ ‘జై కాపు.జైజై కాపు’ అంటూ నినాదాలు చేశారు.రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ప్లకార్డులు, నల్లజెండాలతో నిరసన తెలిపారు.జగన్ భద్రతా సిబ్బంది ఆందోళనకారులను నెట్టేశారు.ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.కాపు వర్గానికి చెందిన యువకులు జగన్ తీరుకు వ్యతిరేకంగా సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
ఈ పరిణామం జగన్ లో కొంచెం ఆందోళనను పెంచింది.