నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ‘ఎన్టీఆర్’ రెండవ షెడ్యూల్ షూటింగ్ కృష్ణ జిల్లాలో ప్రారంభం అయ్యింది.క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌లో బాలకృష్ణ కనిపించబోతున్నాడు.
ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ నటిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక ఈ చిత్రంలో ఇంకొన్ని ముఖ్య పాత్రలకు ప్రముఖ టాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
కాని మొదట చిత్ర యూనిట్ సభ్యులు ఆ వార్తలను కొట్టి పారేస్తూ వచ్చారు.తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

‘ఎన్టీఆర్’ మూవీ అనుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు పాత్రకు రానాను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.క్రిష్ కంటే ముందు ఎన్టీఆర్ దర్శకత్వ బాధ్యతలు చూసుకున్న తేజ స్వయంగా రానాతో మాట్లాడి ఒప్పించాడు.ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో అన్న తర్వాత కూడా రానాతోనే ఆ పాత్రను చేయించాలని భావించాడు.ఇక అందరి దృష్టిని అమితంగా ఆకర్షించిన ఏయన్నార్ పాత్రను నాగచైతన్యతో చేయించాలని భావించారు.
అయితే ఆయన ఒప్పుకోలేదని, ఏయన్నార్ మరో మనవడు సుమంత్‌తో చేయిస్తారు అంటూ వార్తలు రాగా, చిత్ర యూనిట్ సభ్యులు మొదట ఆ వార్తలను కొట్టి పారేయడం జరిగింది.
తాజాగా జరుగుతున్న రెండవ షెడ్యూల్‌కు రానా సిద్దం అయ్యాడు.
ఇటీవలే చంద్రబాబు నాయుడుతో కూడా రానా భేటీ అయ్యాడు.బాలయ్య, క్రిష్‌లు స్వయంగా బాబు వద్దకు రానాను తీసుకు వెళ్లడం జరిగింది.
ట్వీట్‌లో నేను ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తున్నాను అంటూ ప్రకటించాడు.అదే సమయంలో సుమంత్ కూడా తాను కూడా ఎన్టీఆర్ మూవీలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు.
వీరిద్దరి చేరికతో ఎన్టీఆర్ మూవీ స్థాయి అమాంతం పెరిగిందని చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సినిమాలో మరో రెండు కీలక పాత్రలు అయిన సావిత్రి మరియు జయలలితల పాత్రలను కీర్తి సురేష్ మరియు రకుల్ ప్రీత్ సింగ్‌లతో చేయిస్తున్నారు.ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి.మొత్తానికి సినిమా నిండుగా స్టార్స్‌తో క్రిష్ నింపేయబోతున్నట్లుగా అనిపిస్తుంది.
భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.