Isha Koppikar : విడాకులు తీసుకోబోతున్న నాగార్జున హీరోయిన్..!!

ఇషా కొప్పికర్( Isha Koppikar ) .ఈ హీరోయిన్ పేరు చెప్తే ఎవరికీ అంతగా గుర్తుకు రాదు.

 Nagarjuna Heroine Isha Koppikar Who Is Going To Divorce-TeluguStop.com

కానీ నాగార్జున హీరోగా చేసిన చంద్రలేఖ సినిమాలో రమ్యకృష్ణతో పాటు చేసిన మరో హీరోయిన్ అంటే అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది.ఈమె తెలుగులో ప్రేమతో రా, చంద్రలేఖ( Chandralekha ) , కేశవ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

ఇక తెలుగులో ఎక్కువగా నటించకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం ఎక్కువ సినిమాలు చేసింది.అలాగే తమిళంలో కూడా ఈ హీరోయిన్ నటించింది.

ఇక త్వరలోనే ఈ హీరోయిన్ నటించిన తమిళ్ మూవీ అయిలాన్ విడుదలకు సిద్ధంగా ఉంది.ఈమె సినీ కెరియర్ బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం మాత్రం అంత బాగా లేదని తెలుస్తోంది.

Telugu Bollywood, Chandralekha, Isha Koppikar, Ishakoppikar, Keshava, Nagarjuna,

టిమ్మీ నారంగ్ ( Timmy Narang ) అనే రెస్టారెంట్ ఓనర్ తో ప్రేమలో పడి ఆయనను 2009లో పెళ్లి చేసుకుంది.2014లో ఈ జంట కి రియానా అనే కూతురు పుట్టింది.అయితే దాదాపు 14 ఏళ్ల వీరి వైవాహిక బంధానికి ముగింపు పలకడానికి ఇషా చూస్తోంది అంటూ నెట్టింట వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.అంతేకాదు బాలీవుడ్ లోని కొంతమంది ఈమె విడాకుల వ్యవహారంపై ప్రశ్నించగా నేను ఇప్పుడు ఏమి చెప్పదలుచుకోలేను.నన్ను ఏమీ అడగకండి.నాకు కొంచెం ప్రైవసీ ఇవ్వండి అంటూ విడాకుల విషయంపై మాట్లాడడానికి అస్సలు ఇష్టపడలేదట.

Telugu Bollywood, Chandralekha, Isha Koppikar, Ishakoppikar, Keshava, Nagarjuna,

అయితే గత కొద్ది రోజులుగా ఇషా కొప్పికర్ కి తన భర్త టిమ్మీ నారంగ్ తో గొడవలు అవుతున్నాయట.అయితే కూతురు కోసం ఈ గొడవలన్నీ పక్కన పెట్టి మళ్ళీ వారి బంధాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పటికీ ఆ గొడవలకు పులి స్టాప్ పడడం లేదట.ఇక ఈ కారణంతోనే ఇషా కొప్పికర్ గత కొద్దిరోజుల ముందే తన కూతుర్ని తీసుకొని భర్త ఇంటి నుండి బయటికి వచ్చేసినట్టు తెలుస్తుంది.ఇషా త్వరలోనే తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube