తెలుగు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఇటీవలె కింగ్ నాగార్జున హోస్ట్‌గా ప్రారంభం అయింది.ప్రస్తుతం పదో వారం కొనసాగుతున్న ఈ షోలో లాస్య, అభిజిత్, హారిక, అఖిల్, మోనాల్, అరియానా, అవినాష్, మెహబూబ్, సొహైల్ కొనసాగుతున్నారు.
వీరిందరూ బిగ్ బాస్ నాల్గువ సీజన్ టైటిల్కోసం గట్టిగా పోటీపడుతున్నారు.కొందరు మైండ్ గేమ్‌తో ఆడుతుంటే.
మరికొందరు సింపథీ క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ లిస్ట్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ అవినాష్ ముందు వరసలో ఉన్నారు.
రెండో వారం వచ్చినా.ఇంటి సభ్యులతో త్వరగా కలిసిపోయిన అవినాష్ అందరిపై జోకులు పేలుస్తూ ఫుల్ కామెడీ చేశారు.
అయితే గత రెండు వారాలుగా మాత్రం `నేను షో(జబర్దస్త్)ను వదులుకుని వచ్చాను.మళ్లీ తీసుకోమన్నారు.
ఇల్లు అప్పులు క్లియర్ చేసుకోవాలి.` అన్న విషయాలను పదే పదే చెబుతూ.
ప్రేక్షకులకు సింపథీ క్రియేట్ చేశాడు.
మొన్న వీకెండ్‌లో ఇమ్యూనిటీ పొందే టాస్కులో కూడా మళ్లీ అవే విషయాలు చెబుతూ సపోర్ట్ చేయమని కోరాడు.
దీంతో ఇంటి సభ్యులు సైతం అతడికే సపోర్ట్ చేస్తూ ఇమ్యూనిటీని అందించారు.అయితే అవినాష్ జబర్దస్త్ ను వదులుకుని వచ్చాను, మళ్లీ తీసుకోరు అని హౌస్‌లో పదే పదే డప్పు వేస్తుంటే.
ఆయన తమ్ముళ్లు మాత్రం మరోలా సమాధానం చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ తమ్ముళ్లు మాట్లాడుతూ.
మా అన్నయ్య జబర్దస్త్ షో నుంచి శాశ్వతంగా బయటకు రాలేదని.బిగ్ బాస్ షోలోకి వెళ్లేందుకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.
అలాగే మల్లెమాల వాళ్లు అన్నయ్యను మళ్లీ తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.బిగ్ బాస్ షో నుంచి వచ్చాక మళ్లీ తన టీమ్‌తోనే అన్నయ్య జబర్దస్త్‌లో కంటిన్యూ అవొచ్చని అవినాష్ తమ్మళ్లు క్లారిటీ ఇచ్చారు.
దీంతో అనినాష్ కావాలనే జబర్దస్త్‌లో తీసుకోరు.తీసుకోరు అంటూ సింపథీ గేమ్ ఆడుతున్నాడా? అన్న అనుమానాలు ప్రేక్షకుల్లో స్టాట్ అయ్యాయి.