సినిమా చూసి ప్రేమలో పడకపోతే నా పేరు మార్చుకుంటా: మృణాల్

నాని ( Nani ) హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం హాయ్ నాన్న( Hai Naana ).నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Mrunal Thakur Bold Statement At Hai Naana Pre Release Event , Mrunal Thakur,-TeluguStop.com

ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు .ఈ కార్యక్రమానికి చిత్ర బృందం వచ్చారు.

Telugu Baby Kiyara, Hai Naana, Mrunal Thakur, Nani, Sita Ramam, Tolly Wood-Movie

ఇకపోతే ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ వేడుకలో ఈమె చాలా అందంగా క్యూట్ గా అందరిని ఆకర్షించారు.అయితే ఈ ఈవెంట్లో మృణాల్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సీతారామం సినిమా ద్వారా ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించారని ఈమె తెలియజేశారు.ఈ సినిమా కూడా ఎంతో అద్భుతంగా ఉందని డైరెక్టర్ ఈ సినిమా కథ చెప్పేటప్పుడు తాను చాలా ఇంప్రెస్ అయ్యానుని తెలిపారు.

Telugu Baby Kiyara, Hai Naana, Mrunal Thakur, Nani, Sita Ramam, Tolly Wood-Movie

ఈ సినిమాలో నానితో కలిసిన నటించే అవకాశం అని చెప్పగానే తనకు చాలా సంతోషం వేసిందని ఈమె వెల్లడించారు.ఇకపోతే ఈ సినిమాలో తండ్రి కూతుర్ల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఎంత చక్కగా చూపించారని నాని, బేబీ కియరా ( Baby Kiyara )మధ్య వచ్చే సన్నివేశాలు చూసి ప్రతి ఒక్కరు కూడా వారి ప్రేమలో పడతారని అలా వారి ప్రేమలో పడకపోతే నేను తన పేరే మార్చుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.ఈమె ఇంత ధీమాగా చెబుతున్నారు అంటే తప్పకుండా ఆ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని స్పష్టంగా అర్థమవుతుంది.దసరా సినిమా తర్వాత నాని నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube