అవి మానవ నివాసాలు.. క‌నీవినీ ఎరుగ‌ని వింత‌ల‌కు నిల‌యాలు!

ప్రపంచంలో వింత స్థావరాలు చాలా ఉన్నాయి.వాటి నిర్మాణం, అక్క‌డి ప్ర‌జ‌ల‌ జీవనశైలి అంద‌రినీ ఆశ్చర్యపరుస్తుంది.

 Most Strange Colonies Some Are Located On Volcano Details, Strange Colones, Volc-TeluguStop.com

ఈ అద్భుతమైన స్థావరాలలో మానవులు నివసిస్తున్నారు.అక్క‌డి ప్రజాదరణ కారణంగా పర్యాటకుల రద్దీ కూడా అత్య‌ధికంగా ఉంటుంది.అలాంటి కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కుబేర్‌పెడి

దక్షిణ ఆస్ట్రేలియాలో కుబేర్‌పెడి అనే వింత గ్రామం ఉంది.ఈ గ్రామం భూగర్భంలో ఉంది.‘ది మైనింగ్ టౌన్’ అని పిలువబడే ఈ గ్రామంలో చర్చిలు, మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలు, బార్‌లు, హోటళ్లు, షూటింగ్ స్పాట్‌లు, మాల్స్, సాధారణ నగరాలలో మాదిరిగా అనేక విలాసవంతమైన ఇళ్ళు ఉన్నాయి.ఇక్కడ భూమి కింద ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది.ఈ కారణంగా ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది.

Huacachina

పెరూలో Huacachina అనే చిన్న పట్టణం ఉంది, దాని చుట్టూ అన్ని వైపులా ఇసుక తిన్నెలు ఉన్నాయి.స్వర్గం లాంటి ఈ పట్టణం చుట్టూ ఎడారి తిన్నెలు మధ్యలో పచ్చని చెట్లు కూడా ఉంటాయి.

ఇక్కడ నీలి నీటితో కూడిన‌ అందమైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.Huacachinaలో రెస్టారెంట్లు, దుకాణాలు, లైబ్రరీ కూడా ఉంది.ఇక్కడ నివసించే ప్రజలు దీనిని స్వర్గానికి ఏమాత్రం త‌క్కువ‌గా భావించ‌రు.

Telugu Agashima, China, Coober Pedy, Haucachina, Monastory, Peru, Australia, Str

హాంగింగ్ మొనాస్టరీ

మ‌న‌ పొరుగు దేశం చైనాలో ఐదు అత్యంత ప్రమాదకరమైన పర్వతాలు ఉన్నాయి.వీటిలో ఒకటి షాంజీ ప్రావిన్స్‌లోని హాంగింగ్ పర్వతం.హాంగింగ్ మొనాస్టరీగా ప్రసిద్ధి చెందిన ఈ పర్వతాలలో గాలిలో ఊగుతున్న ఇళ్లు నిర్మిత‌మ‌య్యాయి.

Telugu Agashima, China, Coober Pedy, Haucachina, Monastory, Peru, Australia, Str

అగషిమా

ఫిలిప్పీన్ సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఉన్న అగషిమా ప్రపంచంలోనే ధైర్యవంతమైన గ్రామంగా ముద్ర వేసింది.ఈ ద్వీపం ఎత్తు 423 మీటర్లు.ఇది దాదాపు 6 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉంది.1780లో ఇక్కడ పేలిన అగ్నిపర్వతం వల్ల ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లవలసి వచ్చిందని చెబుతారు.అయితే ఈ ప్రమాదం జరిగిన దాదాపు 50 ఏళ్ల తర్వాత ప్రజలు మళ్లీ ఇక్కడే నివాసం ఏర్ప‌రుచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube