ఆస్ట్రియా అధ్యక్షుడిని కరిచిన మోల్డోవా మొదటి కుక్క.. వీడియో వైరల్..

మోల్డోవన్ ప్రెసిడెంట్ మైయా సండూ( Moldovan President Maia Sandu ) దత్తత తీసుకున్న కోడ్రూట్( Codrut ) అనే కుక్క ఒక షాకింగ్ పని చేసింది.అది గురువారం నాడు ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్( Alexander Van der Bellen ) చేతిని కరిచింది.

 Moldovan Presidents Dog Bites Hand Of Austrian President Details, Dog Bite, Mold-TeluguStop.com

దీంతో ఆస్ట్రియా అధ్యక్షుడు షాక్ అయ్యారు.దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అది చూసి చాలామంది అయ్యో పాపం అంటున్నారు.

మోల్డోవా రాజధాని చిసినావ్‌లోని అధ్యక్ష భవనం తోటలో ఇద్దరు అధ్యక్షులు నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

వాన్ డెర్ బెల్లెన్ కుక్కను నిమరడానికి ప్రయత్నించాడు, అయితే కోడ్రూట్ డాగ్ ఆ గుంపును చూసి భయపడి ఆస్ట్రియా అధ్యక్షుడిపై( Austria President ) అటాక్ చేసింది.

సండూ తన కుక్క( Dog ) కరిచిన వెంటనే క్షమాపణలు చెప్పారు, తన కుక్కకు చాలా మంది ప్రజల్లో తిరిగే అలవాటు లేదని వివరించారు.

కారు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయిన తర్వాత ఆమె కోడ్రూట్‌ను దత్తత తీసుకున్నారు.వాన్ డెర్ బెల్లెన్ తీవ్రంగా గాయపడలేదు, కానీ మోల్డోవన్ పార్లమెంట్ స్పీకర్‌తో తదుపరి సమావేశం కోసం అతను చేతికి కట్టు ధరించాల్సి వచ్చింది.

ఆస్ట్రియా అధ్యక్షుడు కుక్కల పట్ల తనకున్న ప్రేమను శుక్రవారం ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చూపించారు.కోడ్రూట్ ఉత్సాహాన్ని అర్థం చేసుకున్నారని, సండూ, ఇతర అధికారులతో తాను చాలా మంచి మీటింగ్ టైం గడిపానని అన్నారు.అలాగే కోడ్రూట్‌కు ఓ బొమ్మను వీడ్కోలు బహుమతిగా ఇచ్చానని వెల్లడించారు.

వాన్ డెర్ బెల్లెన్ రెండు రోజుల పర్యటన కోసం మోల్డోవాలో ఉన్నారు, స్లోవేనియా అధ్యక్షుడితో పాటు, యూరోపియన్ యూనియన్‌లో( European Union ) చేరాలనే దేశ ఆకాంక్షలను చర్చించారు.ఏదేమైనా పరిచయం లేని కుక్కలను ముట్టుకోవడానికి ట్రై చేస్తే అవి భయంతో కరిచేస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube