Balakrishna, Mokshagna : నీకు బాగా బలిసిందా అంటూ బాలకృష్ణకి వార్నింగ్ ఇచ్చిన మోక్షజ్ఞ.. కారణం..?

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) అప్పుడప్పుడు తన నోటి దూల ద్వారా కొన్ని తెలిసి తెలియక మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురైన సంఘటనలు అనేకం చూసాం.

 Mokshagna Gave Warning To Balakrishna-TeluguStop.com
Telugu Anil Ravipudi, Balakrishna, Hanmakonda, Kajal Agarwal, Mokshagna, Sreelee

అయితే తాజాగా అలాంటి సంఘటన ఒకటి చెప్పి మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురయ్యారు.మరి ఇంతకీ బాలకృష్ణ ఏం మాట్లాడారు.ఎందుకు ట్రోల్స్ కి గురయ్యారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

బాలకృష్ణ భగవంత్ కేసరి (Bhagavanth kesari) సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది.ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హన్మకొండలో చాలా గ్రాండ్ గా చేశారు చిత్ర యూనిట్.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బాలకృష్ణ పాల్గొని సందడి చేశారు.అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా స్టేజ్ పై బాలకృష్ణ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ బాలకృష్ణ స్టేజ్ పై ఏం మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం.బాలకృష్ణ కాజల్ అగర్వాల్ (Kajal agarwal) హీరో హీరోయిన్ లుగా శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా భగవంత్ కేసరి సినిమా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి.

Telugu Anil Ravipudi, Balakrishna, Hanmakonda, Kajal Agarwal, Mokshagna, Sreelee

అయితే సినిమాలో బాలకృష్ణని చిచ్చా చిచ్చా అని పిలిచి పిలిచి శ్రీలీల (Sreeleela) షూటింగ్ సెట్లో కూడా అలాగే పిలవడం మొదలుపెట్టిందట.దాంతో నువ్వేమో ప్రతిసారి నన్ను చిచ్చా చిచ్చా అని పిలుస్తూ ఇబ్బంది పెడుతున్నావ్.కానీ నేను నా నెక్స్ట్ సినిమాలో నిన్ను హీరోయిన్ గా తీసుకుందాం అనుకుంటున్నాను అని శ్రీలీలతో చెప్పాను.ఇక ఇదే విషయాన్ని ఇంటి దగ్గరికి వెళ్లాక నా కుటుంబ సభ్యులకి కూడా చెప్పాను.
దాంతో ఈ మాట వినగానే మోక్షజ్ఞ (Mokshagna) టక్కున లేచి వాడు ఆ మాట ఎందుకు అన్నాడో ఏమో తెలియదు కానీ ఏంటి నాన్న త్వరలోనే నన్ను హీరోగా లాంచ్ చేస్తాను అని చెబుతున్నావ్.ఇప్పుడేమో ఆ హీరోయిన్ కి నీ సినిమాలో హీరోయిన్ అని ఆఫరిస్తున్నావ్.

నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా నాన్న అని మొహం మీదే అనేసాడు.

Telugu Anil Ravipudi, Balakrishna, Hanmakonda, Kajal Agarwal, Mokshagna, Sreelee

ఇక వాడన్న ఆ మాటకు నేను అక్కడే స్టన్ అయిపోయి ఎందుకు ఆ మాట అన్నాడు అని ఆలోచనలో పడ్డాను అంటూ బాలకృష్ణ (Balakrishna) స్వయంగా స్టేజ్ పై ఈ విషయాన్ని బయట పెట్టారు.ప్రస్తుతం బాలకృష్ణ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో మరొకసారి ట్రోల్స్ కి గురవుతున్నాడు.అయితే బాలకృష్ణ ఫ్లోలో ఏదో అలా అంటారు కానీ ట్రోలర్స్ కి మాత్రం బాలకృష్ణ మాటలతో బెల్లం దొరికినంత పని అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube