ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద వరకు అందరూ కూడా మాస్ జపం చేస్తున్నారు అని అర్థమవుతుంది.ఇక తమ సినిమాలతో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించెందుకు సిద్ధమైపోతున్నారు.
ప్రతి సినిమాలో కూడా ప్రత్యేకమైన ఇలాంటి మాస్ తోనే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టాలని భావిస్తున్నారు.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాంఇటీవలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన కొత్త సినిమా పోస్టర్ చూస్తుంటే మరోసారి ఎన్టీఆర్ మాస్ పూనకాలు తెప్పించే లాగే కనిపిస్తున్నాడు.
ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఒక ప్రశాంత్ నీల్ సినిమాలోనూ ఎన్టీఆర్ ఊర మాస్ తో అదరగొట్ట పోతున్నాడు అన్నది తెలుస్తుంది.
రాధేశ్యామ్ తో నిరాశపరిచిన ప్రభాస్ సలార్ తో మాత్రం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాలని ప్లాన్ చేశాడు.ఇక ప్రశాంత్ నీల్ టేకింగ్ కూడా అదిరిపోతుందని చెప్పాలి.
ఇప్పటికే ఈ సినిమా కేజీఎఫ్ రెండు కంటే మూడు రెట్లు అద్భుతంగా ఉంటుందని నిర్మాతలు కూడా చెప్పారు.పుష్ప సినిమాతో మాస్ జాతర చేసిన అల్లు అర్జున్ ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం సిద్ధమయ్యాడూ.
సినిమాలో బన్నీ చేసిన పుష్ప రాజ్ పాత్ర ప్రేక్షకులకు తెగ కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి.ఇప్పటికే ఎన్నో మాస్ యాక్షన్ సినిమాలు తీసి హిట్ అందుకున్న దర్శకుడు రాజమౌళి.
మహేష్ బాబు తో కూడా మరో మాస్ యాక్షన్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.

ఇక అటు విజయ్ దేవరకొండ సైతం లైగర్ సినిమాతో మాస్ టచ్ ఇవ్వబోతున్నాడు.లోకల్ బాయ్ బాక్సర్ గా ఎలా అయ్యాడు అనేది ఈ కథలో చూడబోతున్నాం.ఇక ఇప్పుడు నాని సైతం దసరా సినిమాలో లుక్ చూస్తూ ఉంటే మ మ మాస్ అంటున్నాడు అన్నది అర్థమవుతుంది.