Manchu Vishnu : మంచు ఫ్యామిలీ ఆస్తులు పంచుకున్నారంటూ వార్తలు.. మంచు విష్ణు రియాక్షన్ ఇదే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ( Manchu Family )కి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.మంచు ఫ్యామిలీలో తరచూ ఎవరో ఒకరు సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు.

 Manchu Vishnu About House Manchus Reality Show-TeluguStop.com

అంతేకాకుండా మొన్నటి వరకు కూడా మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగాయని విడిపోయారని ఆస్తి పంపకాలు కూడా జరిగాయి అంటూ అనేక రకాల వార్తలు వినిపించాయి.కానీ ఆ వార్తలపై మంచి ఫ్యామిలీ లో ఏ ఒక్కరూ స్పందించలేదు.

దానికి తోడు మనోజ్ పెళ్లి తర్వాత మంచు విష్ణు మనోజ్ గొడవపడిన వీడియో వైరల్ కావడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయ్యింది.

ఆ తర్వాత కొద్ది రోజులకు మంచు విష్ణు( Manchu ishnu ) ఆ వివాదాలపై స్పందిస్తూ అదంతా నిజం కాదని, రియాలిటీ షోలో భాగమని విష్ణు ఆ మధ్య క్లారిటీ ఇచ్చాడు.హౌస్‌ ఆఫ్‌ మంచూస్( House of Manchus ) పేరుతో త్వరలో ఒక పెద్ద రియాలిటీ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించాడు.అయితే మంచు విష్ణు ఈ విషయాన్ని ప్రకటించి దాదాపు 5 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటివరకు ఆ షో కి సంబంధించి ఎటువంటి అప్డేట్ కానీ వార్తలు కానీ లేవు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు భాగంగా మాట్లాడుతూ అనేక విషయాల గురించి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

హౌస్‌ ఆఫ్‌ మంచూస్‌ రియాలిటీ షో త్వరలో ఉండబోతోంది.ప్రపంచంలోనే అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో చర్చలు జరుగుతున్నాయి.అది ఎలా రాబోతుందనేది ఆతృతతో ఎదురుచూస్తున్నాం.మనోజ్‌( Manchu Manoj )తో గొడవ నిజమా? కాదా? అని అడుగుతున్నారు.ఏడెనిమిది నెలల్లో మీకే తెలుస్తుంది అని చెప్పుకొచ్చాడు.ఆస్తులు పంచుకున్నారా? అన్న యాంకర్ ప్రశ్నించగా ఆ విషయంపై మంచు విష్ణు స్పందిస్తూ.అంత అవసరమేంటి? నేను ఉమ్మడి కుటుంబాన్ని( Joint Family ) నమ్ముతాను.కానీ ఆ కుటుంబం అలాగే కలిసి ఉండాలని చెప్పను.

భార్యాపిల్లలతో రెస్టారెంట్‌కు, సినిమాకు ఎక్కడికి వెళ్లినా నాన్నగారికి చెప్పే వెళ్తాను.అలా ఉంటేనే నాకిష్టం.

అలాగే సినిమా షూటింగ్‌లో ఎవరైనా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే నాకు అస్సలు నచ్చదు.పెద్దలు, మహిళలకు గౌరవం ఇవ్వనివాళ్లతో నేను క్లోజ్‌గా ఉండలేను.

అని తెలిపారు మంచు విష్ణు.అనంతరం తన సినిమాల గురించి మాట్లాడుతూ.

నా నెక్స్ట్‌ సినిమా కన్నప్ప భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాము.నేను చాలా రిస్క్‌ తీసుకుంటున్నాను.

ఈ సెప్టెంబర్‌ నుంచి కన్నప్ప( Kannappa ) షూటింగ్‌ ప్రారంభం కానుంది అని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube