పులి చేతిలో నుంచి తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి చనిపోయినట్లు నటించి ఏకంగా పులికే పంగనామం పెట్టి తప్పించుకున్న ఘటన మహారాష్ట్ర జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి బంధరా జిల్లాలోని తుంసార్ అనే అటవీ తంప్రాంలో వాహనాలు ప్రయాణించే దారి గుండా చిరుత పులి వెళుతూ కలకలం సృష్టించింది.
అయితే ఇందులో భాగంగా చిరుత పులి రోడ్డు దాటుతుండగా పక్కనే ఉన్నటువంటి పొలంలోకి వెళ్ళింది.ఈ పొలంలో ఓ వ్యక్తి ఉండగా అతడు వెంటనే వెనకవైపు నుంచి వస్తున్నటువంటి పులిని గమనించి చనిపోయినట్లు నటిస్తూ కిందపడిపోయాడు.
అయితే అతడిని చూసిని పులి చనిపోయాడనుకుని అక్కడి నుంచి దూకి వెళ్లి పోయింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.

అయితే ఇదంతా గమనిస్తున్న స్థానిక యువకులు ఈ సంఘటనని తమ చరవానుల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియోపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు.ఇందులో కొందరు చాలా అద్భుతంగా నటించావు నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే నీలో మంచి గొప్ప నటుడు ఉన్నాడు సినిమాల్లో ట్రై చెయ్ అంటూ సలహా ఇస్తున్నారు.
తన సమయస్ఫూర్తితో ఏకంగా పులి చేతిలో నుంచి తప్పించుకొని బయట పడినటువంటి ఆ వ్యక్తిని పలువురు అభినందిస్తున్నారు.