ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగి పోయింది.ఒకప్పుడు అతి తక్కువగా ఉన్న ప్లాస్టిక్ వినియోగం ఇప్పుడు ప్రమాదకర స్థాయిలో పెరిగి పోయింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లాస్టిక్ లేకుండా జీవితం లేనట్లుగా మారిపోయింది.ప్రతి రోజు మనిషి వాడే వస్తువుల్లో 99 శాతం ప్లాస్టిక్‌ను వినియోగించి తయారు అయినవే అంటూ అత్యంత భయంకర విషయాన్ని ఇటీవలే ఒక సర్వేలో ప్రముఖ సంస్థ వెళ్లడించింది.
ఇది నిజంగా ప్రజా జీవితాన్ని నాశనం చేసే అతి భయంకర విషయం అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా అంటున్నారు.
మనుషులకు మాత్రమే కాకుండా ఈ భూమి మీద జీవించి ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి కూడా ప్లాస్టిక్ అనేది అత్యంత ప్రమాదకరమైనది అంటూ శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు.తాజాగా ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఆ వీడియోతో ప్లాస్టిక్ ఇతర జీవరాశులకు కూడా ఎంతగా నష్టం చేకూర్చుతుందో చెప్పుకోవచ్చు.
పక్షుల సంఖ్య తగ్గడంతో పాటు పకృతికి మేలు చేసే జీవరాశులను ప్లాస్టిక్ నాశనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అమెరికాకు చెందిన ఒక నావికుడు చేపను పట్టుకున్న సమయంలో దాని పొట్ట భాగం గట్టిగా తలిగింది.దాంతో ఆయన ఏమై ఉంటుందా అంటూ దాన్ని పరీక్షిస్తూ వీడియో తీశాడు.ఆ పొట్టలోంచి ప్లాస్టిక్ బయట పడింది.
చేప కడుపులో ప్లాస్టిక్ చేరి దాన్ని కదలకుండా చేస్తుందని, అందుకే వల్లే ఆ చేప ఈదలేక పైనే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు.ఇలా ఎన్నో చెపల్లో కేజీల కొద్ది ప్లాస్టిక్ ఉంటుందని.
పెద్ద పెద్ద చేపల పొటల్లో క్వింటాల్ల కొద్ది ప్లాస్టిక్ ఉండే అవకాశం ఉంది అంటూ పర్యావరణ నిపుణులు అంటున్నారు.