దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో ఇక నుంచి 24 గంటలూ కూడా పబ్బులు,మాల్స్,రెస్టారెంట్లు,మల్టీ ప్లెక్స్ లు తెరిచే ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కంపెనీ ల పని తీరు ప్రోత్సహించడం కోసం మహారాష్ట్ర సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి,ఉద్యోగావకాశాలను పెంచడమే లక్ష్యంగా మహారాష్ట్ర టూరిజం మినిస్టర్ ఆదిత్య థాక్రే ఉన్నత స్థాయి సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా ఈ నెల 26న పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.
ముంబైలోని ఫోర్ట్కాలా, ఘెడా, బాంద్రా, కుర్లా ప్రాంతాల్లోని అన్ని మాల్స్, రెస్టారెంట్స్, మల్టీప్లెక్స్‌లు, పబ్బులను 24 గంటల పాటు తెరిచి ఉంచడానికి అనుమతులను ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఈ మేరకు పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి కూడా అనుమతులు లభించినట్లు సమాచారం.అలానే ఇవి ఓపెన్ లోనే ఉండడం తో ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, కావున జన నివాసాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లోనే ఇవన్నింటిని 24 గంటలూ తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.