అర్ధరాత్రి.. కానిస్టేబుల్ ప్రశ్నలు.. మనసు ఎంతో గాయపడింది: హీరోయిన్

మలయాళ నటి అయినా అర్చనా కవి తాజాగా తనతో ఒక పోలీస్ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలపడంతో, ఆ విషయం పట్ల సదరు కానిస్టేబుల్ ని అంతర్గతంగా విచారిస్తున్నట్లు కొచ్చి డీఎస్పీ వెల్లడించారు.అయితే ఆ సమయంలో తనకు ఎదురైన ఆ చేదు అనుభవం గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది నటి అర్చన కవి.

 Malayalam Actress Archana Kavi Alleges Rude Behaviour Kochi-police Back Bench St-TeluguStop.com

అసలేం జరిగిందంటే.ఆమె తన ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగే ఇద్దరు పిల్లలు కలిసి సరదాగా బయటికి వెళ్లారట.

అయితే ఆటోలో 11:00 సమయంలో తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కొచ్చి కానిస్టేబుల్ పెట్రోలింగ్ లో భాగంగా ఆమె వస్తున్న ఆటోని ఆపారట.

ఆ తర్వాత అతడు పోలీస్ కానిస్టేబుల్ ఆమెను ఎక్కడి నుంచి వస్తున్నారని ఈ పిల్లలు ఎవరు?ఎక్కడ నుండి తీసుకువస్తున్నారు?అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి వేదించాడట.కానీ ఆమె ఎంత చెప్పినా కూడా సదరు కానిస్టేబుల్ వినిపించుకోలేదట.అంతేకాకుండా ఆమెను పిచ్చి పిచ్చి ప్రశ్నలు, ఇబ్బందికర ప్రశ్నలు వేసి విధించారట.తనకు జరిగిన ఆ సంఘటన తాను ఎంతో వేధించింది అని చెప్పుకొచ్చింది అర్చన కవి.అయితే ఈ విషయంపై తాను పోలీసులను నిందించడం లేదని ఎందుకంటే వారి డ్యూటీ చేస్తున్నారని, కాకపోతే ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు తనను నిజంగానే బాధ కలిగించింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Telugu Archana Kavi, Bench, Kerala-Movie

అయితే ఈ విషయంపై వచ్చి కొచ్చి డీసీపీ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నామని, సినీనటి అలాగే కానిస్టేబుల్ ఇద్దరి వాదనలు విన్నానని, రాత్రి సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వారిని ఆపి ప్రశ్నించారని, అయితే ఆ సమయంలో ఆ నటి తన ముఖానికి మాస్కు పెట్టుకోవడం వల్ల కానిస్టేబుల్ ఆమెను గుర్తు పట్టలేకపోయారని, ఆ పరిస్థితుల్లో నటి ఉన్న సాధారణ మహిళ ఉన్నా విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు డిసిపి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube