మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన లోకేష్..!!

త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టిడిపి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో లోకేష్తో పాటు అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య పాల్గొన్నారు.10 అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.పల్లెలు గెలిచాయి ఇప్పుడు మన వంతు అనే టైటిల్ పేరిట టిడిపి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది.

 Lokesh Releases Municipal Election Manifesto Ys Jagan,lokesh,muncipal Elections,-TeluguStop.com

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు చార్జీలు పెంచారు.

అదే రీతిలో పెట్రోల్ మరియు డీజిల్ చార్జీలు కూడా పెంచుతున్నారు.

జగన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్రోల్ ధర 200 రూపాయలకు చేరేటట్లు పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు.అన్నింటిపై పనులు పెంచుకుంటూ గ్యాస్ మరియు సిమెంట్ ధరలు కూడా పెంచుకుంటూ పోయారు అని విమర్శించారు.

విద్యుత్ ఛార్జీల విషయంలో పట్టణాల్లో మాత్రమే కాకుండా గ్రామాల్లో కూడా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.కుడి చేతితో ₹10 ఇచ్చి ఎడమ చేతితో వంద రూపాయలు లాక్కొంటున్నా పరిస్థితి ప్రస్తుతం ఏపీలో నెలకొందని పేర్కొన్నారు.

పట్టణ ప్రాంత ప్రజలు ఏ విధమైన అభివృద్ధి ఆశిస్తున్నారో అటువంటి కార్యక్రమాలు చేయడానికి టిడిపి రెడీగా ఉన్నట్లు లోకేష్ స్పష్టం చేశారు.జగన్ అంటే గన్ కంటే ముందు జగన్ వస్తారని భావించారు, కానీ ఇది బుల్లెట్లు లేని గన్ అంటూ సెటైర్లు వేశారు.

రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉన్నారు వారిని పట్టించుకునే నాధుడే లేడు అంటూ లోకేష్ వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube