ఏపీ రాజకీయాలు మెల్లిగా రక్తికెక్కుతున్నాయి.ఒక్కో రాజకీయ పార్టీ.ఒక్కో వ్యూహం తో రాజకీయాల్లోకి వెళ్ళాలని చూస్తున్నాయి.2019 ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పుడ్చుకునెందుకు.మళ్లీ పుంజుకునేందుకి వ్యూహాలు ప్రారంభించాయి.అయితే ఈ సారి 2019 ఎన్నికల్లో మాదిరి కాకుండా 2014 ఎన్నికల్లో మాదిరి మహా కూటమితో రావాలని చూస్తున్నాయి.అయితే ఇక్కడ ఒక పెద్ద చేంజ్ ఉంది.2014 ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను బట్టి చంద్రబాబు కు ప్రజలు పట్టం కట్టారు.ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది.బీజేపీ నీ అధికారం లోకి తీసుకు వచ్చేందుకు.మోదీ సుడిగాలి పర్యటనలు చేశారు.ఇక ప్రశ్నించడం కోసం అంటూ పవన్ జనసేన పార్టీ పెట్టారు.
ఇక ముగ్గురు కలిసి ఒక పక్కా వ్యూహం తో ఎన్నికలకు వెళ్లారు.ఈ ఎన్నికల్లో బీజేపీ కొన్ని సీట్లను తీసుకొని పోటీ చేసింది.
జనసేన మాత్రం పోటీకి దిగకుండా కేవలం మద్దతు ఇచ్చి నిలబడి పోయింది.ఆ తర్వాత కూటమి అధికారం లోకి వచ్చినా.
పవన్ పదవి తీసుకోలేదు.బీజేపీ మాత్రం కొన్ని మంత్రి పదవులు తీసుకుంది.
ఇక ఈ సారి ఎన్నికల్లో మాత్రం పవన్ తగ్గేది లేదని.పక్క వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.కనీసం పొత్తులో భాగంగా 25 నుంచి 30 సీట్లను ఆశిస్తున్నాడు.2019 ఎన్నికల్లో రాజోలు సీటు తప్పా ఎక్కడ గెలవలేదు.అంతే కాకుండా ఆ పార్టీ కి 6 శాతం ఓటు బ్యాంకు ఉంది.ఇప్పుడు అటు ఓటు బ్యాంకు తో పాటు.ఇటు సీట్లను పెంచుకొని ఉనికిని చాటాలని చూస్తున్నారు.

మరి పవన్ 30 సీట్లు తీసుకుంటే.అక్కడ స్థానికంగా పవన్ పార్టీ బలపడుతుంది.దాన్ని బేస్ చేసుకొని.
మిగిలిన రాష్ట్రం మొత్తం జెండా పతాలి అనేది పవన్ ప్లాన్.అయితే పవన్ ప్లాన్ మాత్రం టీడీపీ కి పెద్ద మైనస్ గా మారే ఛాన్స్ కనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు.
విశాఖ నార్త్, చోడవరం, గాజువాక, భీమిలి, యలమంచిలి,రాజానగరం, రాజోలు, అమలాపురం, కాకినాడ రూరల్, భీమవరం, నర్సాపురం, తాడేపల్లి గూడెం, కైకలూరు, విజయవాడ పశ్చిమ, తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ, పుట్టపర్తి, గిద్దలూరు, చీరాల, చిత్తూరు, తిరుపతి, దర్శి, అనంత పుర్ అర్బన్ సీట్ల వరకు చంద్రబాబు పవన్ కి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.మిగిలిన 5 స్థానాలను అక్కడి స్థానిక నేతల అభిప్రాయాలు అనుసారం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇక్కడే టీడీపీ జనసేన ల ప్లాన్ బెడిసికొట్టే ఛాన్స్ ఉంది.అధినేతలు భావించి నట్టు కాకుండా.
స్థానికంగా ఉన్న తెలుగుదేశం నేతలు ఎదురు తిరిగి రెబల్స్ గా మారితే అది వైసీపీ కి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది .గ్రౌండ్ స్థాయిలో బేస్ ఉన్న టీడీపీ ఇంత బారి స్థాయిలో పొత్తు ఒప్పుకోవడం ఒక పెద్ద వైఫల్యం అని కూడా విమర్శలు మొదలు అయ్యాయి.ఇది రానున్న రోజుల్లో వైసీపీ కంటే టీడీపీ కే పెద్ద మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.మరి అన్ని తెలిసిన రాజకీయ చానిక్యుడు చంద్రబాబు ఎందుకు ఇంత భారీ పొత్తు ఒప్పుకున్నాడు అనేది ఆసక్తిగా మారింది.
ఈ పొత్తులో బీజేపీ పేరు ఎక్కడ వినిపించడం లేదు.దాంతో జన సేన కు ఇచ్చే సెట్లలోనే వాటిని సర్దే అవకాశం కూడా ఉంది.మరి ఈ సారి కూటమి గెలుస్తుంద.? లేక జగన్ రెండో సారి అధికారం లోకి వస్తాడా చూడాలి.