అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు గడుస్తోంది.తాజాగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
ఇక బన్నీ క్రేజ్ ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు.అయితే తన కెరీర్లో ఇప్పటివరకు 12 సినిమాలకు పైగానే వదులుకున్నాడు.
ఇందులో ఆరు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలవడం విశేషం.అలా బన్నీ వదులుకున్న ఆ హిట్టు సినిమాలు మరియు ఫట్టు సినిమాలు ఏంటో చూద్దాం.
జయం: నితిన్, సదా కాంబినేషన్లో వచ్చిన జయం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మనమందరం చూసాం.తేజ ఈ సినిమా కథను మొదట అల్లు అరవింద్ కి చెప్పగా ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి నితిన్ ఈ సినిమా చేసి హిట్టు కొట్టాడు.
భద్ర: అల్లు అర్జున్ ఆర్య సినిమా తీస్తున్న సమయంలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న బోయపాటి శ్రీను భద్ర సినిమా కథను బన్నీకి చెప్పగా, అప్పుడు ఆర్య లాంటి లవ్ స్టోరీ తీసి వెంటనే యాక్షన్ సినిమా ఎందుకు చేయడం అంటూ భద్ర సినిమాను రిజెక్ట్ చేశాడు.ఆ తర్వాత రవితేజ తీసి హిట్టు కొట్టాడు.
100%లవ్ : ఆర్య సినిమా తర్వాత అలాంటి ఒక హిట్ ఇవ్వాలనుకుని సుకుమార్ తన రాసుకున్న 100% లవ్ సినిమా కథను ముందుగా బన్నీకి చెప్పాడు.అని సినిమా కథ అర్థం కాని బన్నీ ఆ సినిమాని రిజెక్ట్ చేయడంతో నాగచైతన్య చేసి హిట్టు కొట్టాడు.
కృష్ణాష్టమి: జోష్ సినిమా తర్వాత దర్శకుడు వాసు వర్మ లవర్ పేరుతో ఒక సినిమా కథ రాసుకొని అది బన్నీకి వినిపించాడు.అయితే బన్నీ ఆ కథను రిజెక్ట్ చేయగా అదే కథని కృష్ణాష్టమి అనే పేరు మార్చి సునీల్ హీరోగా తీసి ఫ్లాప్ ఇచ్చాడు.
పండగ చేస్కో : రామ్ హీరోగా వచ్చిన పండగ చేస్కో సినిమా మొదట బన్నీ దగ్గరికి వచ్చింది.దర్శకుడు గోపీచంద్ మల్లిని కోన వెంకట్ ఇద్దరు కలిసి ఒప్పించిన కూడా బన్నీ ఈ సినిమాను ఒప్పుకోలేదు అయితే ఈ చిత్రం రామ్ హీరోగా వచ్చి ఫ్లాప్ అయింది.

అర్జున్ రెడ్డి: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు ఈ సినిమా కథను మొదట బన్నీకి వినిపించిన రిజెక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ చేసి హిట్టు కొట్టాడు.
గ్యాంగ్ లీడర్: నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా ఒక యావరేజ్ చిత్రం గా నిలిచింది.మనం అంటే ఒక క్లాసిక్ సినిమాను రూపొందించిన దర్శకుడు విక్రమ్ కే కుమార్ మొదట ఈ కథను బన్నీ కి వినిపించిన అతను నో చెప్పడంతో నాని ఈ కథకి ఓకే చెప్పాడు.

డిస్కో రాజా: రవితేజ చేసిన డిస్కో రాజా సినిమా ఒక డిజాస్టర్ అనే చెప్పాలి.ఈ చిత్రాన్ని మొదట దర్శకుడు ఆనంద్ అల్లు అర్జున్ కి వినిపించగా ఈ కథను రిజెక్ట్ చేశాడు.
గీత గోవిందం: విజయ్ దేవరకొండ కి హిట్ ఇచ్చిన ఈ చిత్రం మొదట అల్లు అర్జున్ చేయాల్సింది.అయితే గీతగోవిందం కథను పరుశురాం బన్నీ కి ముందుగా చెప్పగా అతను కథను రిజెక్ట్ చేశాడు.
జాను: 96 పేరుతో తమిళంలో విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో అల్లు అర్జున్ తో రీమేక్ చేయాలని దిల్ రాజు భావించిన ఎందుకో ఈ కథకు నో చెప్పాడు అల్లు అర్జున్.కానీ ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది.

బొమ్మరిల్లు: ఆల్ టైం హిట్ గా సిద్ధార్థ కెరియర్ లో నిలిచిన బొమ్మరిల్లు సినిమా మొదట అల్లుఅర్జున్ దగ్గరికి వెళ్ళింది.కానీ హ్యాపీ సినిమా చేస్తూ బన్నీ బిజీగా ఉండడంతో ఈ కథకు నో చెప్పాడు.దాంతో ఈ సినిమా సిద్ధార్థ్ చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
సుప్రీం: సాయి ధరంతేజ్ హీరోగా వచ్చిన సుప్రీం సినిమా మంచి విజయాన్ని సాధించింది అనిల్ రావిపూడి మొదట ఈ సినిమా కథను అల్లు అర్జున్ కి వినిపించగా అతడు రిజెక్ట్ చేశాడు.