1.ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్
మనోవర్ ఫారుకి స్టాండ్ ఆఫ్ కామెడీ షోకి శిల్పకళా వేదికలో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.అయితే ఈ షోను అడ్డుకుంటామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
2.శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతోంది .దీంతో అధికారులు 12 గేట్లను ఎత్తి వేశారు.
3.మునుగోడు లో నేడే ప్రజా దీవెన సభ
మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేడు ప్రజా దీవెన సభ నిర్వహిస్తోంది.
4.రేపటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్
రేపటి నుంచి తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు విద్యార్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
5.భారత్ లో కరోనా
గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,754 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
6.రాజగోపాల్ రెడ్డి కి రేవంత్ ఆఫర్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తే ఆయనకు కాంగ్రెస్ బీ ఫార్మ్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు.
7.టీఆర్ఎస్ కే సీపీఐ మద్దతు
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే సీపీఐ మద్దతు ఇస్తున్నట్లు చాడా వెంకటరెడ్డి ప్రకటించారు.
8.చిరంజీవి కీలక ప్రకటన
శని కార్మికుల కోసం త్వరలోనే ఆసుపత్రి కట్టిస్తామని మెగా స్టార్ చిరంజీవి ప్రకటించారు.
9.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 30,212 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
10.రేపు అమిత్ షా పర్యటన
ఆగస్ట్ 21న మునుగోడు లో బీజేపీ భారీ సభను నిర్వహిస్తోంది.ఈ సభ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
11.జస్టిస్ ఎన్వీ రమణ కు ఏపీ ప్రభుత్వం విందు
భారత్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు ఏపీ ప్రభుత్వం తరఫున విందును ఏర్పాటు చేశారు.
12.కేసీఆర్ పై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్
ఫామ్ హౌస్ లో పడుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మునుగోడు రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
13.పార్టీ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్
టిఆర్ఎస్ ప్రజా దీవెన సభలో పార్టీ జెండాను ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
14.చావడానికైనా తాను సిద్ధం : రాజా సింగ్
రాముడు కోసం తాను చావడానికైనా సిద్ధమేనని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
15.బిజెపి పై రేవంత్ రెడ్డి కామెంట్స్
తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న తప్పులే రాష్ట్రంలో బీజేపీ చేస్తోందని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
16.చచ్చే వరకు కాంగ్రెస్ లోనే ఉంటాం
ఎవరైనా సమస్యలు చెబితే వారు పార్టీ మారుతారని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారని, మేము ఎక్కడికి పోము సచ్చే వరకు కాంగ్రెస్ లోనే ఉంటామని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్పష్టం చేశారు.
17.కిషన్ రెడ్డి కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం కూర్చున్న మునుగోడులో టిఆర్ఎస్ గెలవదని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
18.జస్టిస్ ఎన్వి రమణ కు గౌరవ డాక్టరేట్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.
19.జగన్ పై సోము వీర్రాజు కామెంట్స్
ఏపీ సీఎం జగన్ మీద చేయి వేసి తీయడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవారం వెటకారం చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,800 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,150
.