వాలంటీర్ వ్యవస్థకు( Volunteer System ) తాము వ్యతిరేకం కాదంటూ లోకేష్( Nara Lokesh ) కీలక వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.
బుదవారం మంగళగిరి నియోజకవర్గంలో( Mangalagiri Constituency ) తొమ్మిది మంది వాలంటీర్లు టీడీపీలో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా వాలంటీర్ల భవిష్యత్తుకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
అంతేకాదు కేవలం పెన్షన్ లే కాకుండా ఇతర సంక్షేమ పథకాలు కూడా రాబోయే రోజుల్లో వాలంటీర్ల ద్వారా అందజేస్తామని లోకేష్ స్పష్టం చేయడం జరిగింది.ఇటీవల వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వైసీపీ…టీడీపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పరిస్థితి మారింది.
ఏప్రిల్ నెల ప్రారంభంలో పెన్షన్ పంపిణీ విషయంలో ఎలక్షన్ కమిషన్( Election Commission ) వాలంటీర్లు చేత పెన్షన్ పంపిణీ చేయకూడదని ఆదేశాలు ఇవ్వటం జరిగింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ జరగకుండా తెలుగుదేశం అడ్డుకుందని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు.ఈ క్రమంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని వాళ్ళ జీతాలు కూడా పెంచుతామని హామీ ఇచ్చారు.
కాకపోతే ఎన్నికల సమయంలో ఓ పార్టీకి అనుకూలంగా పనిచేయకూడదని తెలియజేశారు.ఇదిలా ఉంటే తాజాగా లోకేష్ కూడా వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.