కేసీఆర్ ' ముందస్తు ' వ్యూహం ? 

ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారశైలి చూసుకుంటే, సొంత పార్టీ టీఆర్ఎస్ లోనే కాదు, తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది అసలు ఏ వ్యూహంతో కేసీఆర్ రాజకీయంగా స్పీడ్ పెంచారు.ఏ వ్యూహం ప్రకారం ఆయన నడుచుకుంటున్నారు అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది.

 Kcr In The Idea Of Going For Early Elections Kcr, Telangana, Hujurabad Elections-TeluguStop.com

ఎప్పుడూ లేని విధంగా కేంద్ర అధికార పార్టీ బీజేపీ ని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.తెలంగాణ లో ఊహించని విధంగా బీజేపీ  బలపడుతూనే టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది.

ప్రస్తుతం కేసీఆర్ ముందుకు వెళుతున్న తీరు సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు.

అసలు కేసిఆర్ ఎప్పుడూ లేని విధంగా ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు ?  క్షేత్రస్థాయి పర్యటనలు ఎందుకు చేపట్టాలని అనుకుంటున్నారు?  హరీష్ రావు వంటి వారికి అనూహ్యంగా ఎందుకు ప్రాధాన్యం పెంచారు ?  ఇలా అనేక సందేహాలు టీఆర్ఎస్ శ్రేణులు లోనే గందరగోళం సృష్టిస్తున్నాయి.2014లో ఏపీ తెలంగాణ విభజన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.2019 వరకు ఎన్నికల సమయం ఉన్నా , 2018 లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు.అనుకున్నట్టు గానే సక్సెస్ అయ్యారు.ఇప్పుడు రెండోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లో కేసీఆర్ ఉన్నారనే ప్రచారం జోరందుకుంది.

Telugu Central Bjp, Congress, Hujurabad, Telangana, Telangana Cm-Telugu Politica

గత రెండు సార్లు టీఆర్ఎస్ ఎన్నికల హామీలు ఎన్నో ఇచ్చినా వాటిని ఇంకా పూర్తిస్థాయిలో చేయలేదు.ముఖ్యంగా  డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విమర్శల పాలవుతూ వస్తోంది.దీనికి తోడు తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రజా వ్యతిరేకత గతంతో పోలిస్తే బాగా  పెరిగిందనే ప్రచారం జరుగుతోంది.వీటన్నింటిని  లెక్క వేసుకునే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనను చేస్తున్నట్టు గా  ఇప్పుడు నెలకొన్న హడావుడి ని బట్టి అర్థం అవుతోంది.

అయితే ఈ విషయం లో కేసీఆర్ మాత్రం తన వ్యూహం ఏంటి అనేది బయటకి పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube