టీఆర్ఎస్ పార్టీకి ఓ సాంప్రదాయం ఉంది.అదేంటంటే ఈ పార్టీ ఏ రకమైన ప్రోగ్రామ్ ను గానీ లేదంటే సభలను గానీ నిర్వహించినా సరే భారీగా నిర్వహిస్తుంది.
కేసీఆర్ మొదటి నుంచి ఇదే విధమైన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.ఇప్పటికే ఎన్నో సభలను ఇలా గ్రాండ్‌గానే నిర్వహించారు.
ఎందుకంటే ఇలా గ్రాండ్‌గా నిర్వహిస్తే ప్రజల్లో తమ పార్టీ బలంగా ఉందని, తమకు ప్రజల నుంచి మద్దతు చాలా ఎక్కువగా ఉందని నిరూపించుకనేందుకు ఇలాంటి భారీ సభలను నిర్వహిస్తుంటారు కేసీఆర్.అంతెందుకు రివ్యూ మీటింగ్‌లు కూడా ఇలాగే చేస్తుంటారు.
ఇకపోతే ఇప్పుడు పార్టీ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించేందుకు రెడీ అవుతుంది టీఆర్ఎస్ పార్టీ.మరి దీన్ని ఇంకే రేంజ్లో నిర్వహిస్తుందో ఊహిచండి.అవును మరి దీన్ని భారీ ఎత్తున నిర్వహించేదుకు టీఆర్ ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ నెల 25వ తేదీని దీన్ని ప్లాన్ చేస్తున్నారు.
కాగా కేటీఆర్ స్వయంగా అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.కాగా దీనికి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను రప్పించాలని చూస్తున్నారు.
ఇందుకోసం ఇప్పటికే 14 వేల మందిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రప్పిస్తున్నారు.
అయితే ఈ మీటింగ్ లో కాగా ఈ మీటింగ్ నిర్వహణలో హైదరాబాద్ నేతల చేతుల్లోనే కేటీఆర్ పెట్టినట్టు తెలుస్తోంది.

ఈ పార్టీ మీటింగ్‌లో కేటీఆర్ వర్గానికి చెందిన కొద్ది మంది నేతలకు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ప్లీనరీ మీటింగ్ కమిటీల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటుగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ లాంటి వారు ఈ కమిటీల్లో చోటు దక్కించుకున్నారు.వీరితో పాటు సిటీ ఎమ్మెల్యేలు అయిన మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్.లాంటి వారే ఇందులో ఉండటాన్ని బట్టి చూస్తుంటే కేటీఆర్ తన వర్గానికి ఏ మేరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమయిపోతుంది.
అంటే రాబోయే రోజుల్లో ఆయన పార్టీకి అధినేత అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే తన వర్గానికి పెద్దపీట వేస్తూ పార్టీలో పట్టు పెంచుకుంటున్నారని తెలుస్తోంది.