ముదురు బ్యాచ్‌కే ఫిక్స్ అయిన కాజల్

తెలుగులో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇంకా టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది.యంగ్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కేవలం ముదురు హీరోలకే పరిమితం అయ్యింది.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో జోడి కట్టిన కాజల్ ఇప్పుడు మరో సీనియర్ హీరోతో రొమాన్స్‌కు రెడీ అంటోంది.

 Kajal Aggarwal Nagarjuna-TeluguStop.com

మన్మధుడు-2 చిత్రంతో తన వయస్సును బయటపెట్టుకున్న అక్కినేని నాగార్జున తన నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌తో కలిసి నటించనున్నాడు.పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈసారి రెచ్చిపోనున్న నాగార్జున ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు.గతంలో ఆఫీసర్ అంటూ రామ్ గోపాల్ వర్మతో కలిసి వచ్చిన నాగ్, బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాడు.

దీంతో ఇప్పుడు ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ పాత్రతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

సాల్మన్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో కాజల్‌ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

గతంలో నాగ చైతన్యతో నటించిన కాజల్ ఇప్పుడు అతడి తండ్రితో నటించనుంది.మరి వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube