సుధీర్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన ఢీ బ్యాచ్

జబర్దస్త్ తో పాపులర్ అయినా సుడిగాలి సుధీర్ తన టాలెంట్ తో మల్టీ టేలెంటడ్ గా మన్ననలు అందుకున్నాడు.

దీంతో జబర్దస్త్ షో చేస్తూనే యాంకర్ గా మారిపోయి ఢీ, పోవే పోరా షోలతో తన మార్క్ చూపించాడు.

ఇక ఇప్పుడు ఊహించని విధంగా హీరోగా మారిపోయాడు.సాఫ్ట్ వెర్ సుధీర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

ఈ సినిమాలో సుధీర్ కి జోడీగా ధాన్యా బాలకృష్ణన్ నటిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ పై దృష్టిపెట్టిన సుధీర్ తనకున్న పరిచయాలతో సినిమా కోసం వాడుకుంటున్నాడు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.సుధీర్ ప్రస్తుతం ఢీషో చేస్తూ ఉండటంతో అందులో జడ్జ్ లు, అలాగే కంటిస్టెంట్ లతో తన సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయించాడు.

Advertisement

ఇక ట్రైలర్ రిలీజ్ సందర్భంగా శేఖర్ మాస్టర్, హీరోయిన్ పూర్ణ, యాంకర్ రష్మీ, ప్రదీప్, వర్షిణీ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు.ఇక ఈ సినిమాతో రాజశేఖర్ పులిచర్ల హీరోగా పరిచయం అవుతూ ఉండగా, శేఖర్ నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించారు.

మరి కమెడియన్ నుంచి హీరోగా మారిన సుధీర్ కి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు