టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ చివరిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.అంతేకాకుండా ఇప్పుడు అదే ఊపుతో దేవర,వార్ ( Devara, War )లాంటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
నటనతో పాటు మంచి డాన్స్ స్కిల్స్ ఉండటంతో బిగ్ స్టార్ గా మారిపోయాడు తారక్.అయితే ఇటీవల కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజే 100 కోట్ల క్లబ్ లో చేరి అరుదైన రికార్డును క్రియేట్ చేస్తున్నాయి.
![Telugu Devara, Earn, Janhvi Kapoor, Jr Ntr, Jrntr, Saif Ali Khan, Tollywood-Movi Telugu Devara, Earn, Janhvi Kapoor, Jr Ntr, Jrntr, Saif Ali Khan, Tollywood-Movi](https://telugustop.com/wp-content/uploads/2024/04/jr-ntr-miss-the-chance-to-earn-rs-100-crore-do-you-know-whyb.jpg)
అయితే ప్రస్తుతం ఆ అవకాశం జూనియర్ ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడు.ఇంతకీ ఎన్టీఆర్ మిస్ చేసుకున్న ఆ అవకాశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరి ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించడంతో బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ సత్తా ఏంటో రుజువైంది.దీంతో ఆయన అభిమానులు, ఇండస్ట్రీ కూడా చాలా హ్యాపీగా ఉంది.అయితే దేవర’ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు.అయితే అనుకున్న సమయానికి విడుదలైతే బాక్సాఫీస్ ఓపెనింగ్ కలెక్షన్లతో ఈ సినిమా భారీ బజ్ క్రియేట్ చేసేది.సమ్మర్ రిలీజ్ అడ్వాంటేజ్ తో పాటు మరే సూపర్ స్టార్ సినిమా కూడా పోటీలో లేకపోవడంతో ఈ సమయంలో రిలీజ్ అయితే కాసుల వర్షం కురిసేది.
![Telugu Devara, Earn, Janhvi Kapoor, Jr Ntr, Jrntr, Saif Ali Khan, Tollywood-Movi Telugu Devara, Earn, Janhvi Kapoor, Jr Ntr, Jrntr, Saif Ali Khan, Tollywood-Movi](https://telugustop.com/wp-content/uploads/2024/04/jr-ntr-miss-the-chance-to-earn-rs-100-crore-do-you-know-whyc.jpg)
దేవర అనుకున్నట్లుగానే మంచి మ్యూజిక్, ట్రైలర్ తో విడుదలై ఉంటే తొలిరోజే రూ.100 కోట్ల గ్రాస్ సాధించి ఉండేది.ప్రీ రిలీజ్ హైప్, ఎన్టీఆర్ పాపులారిటీతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి దోహదం చేసేవి.కానీ ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ సినిమా, తెలుగులో దేవర సినిమా చేస్తుండటంతో విడుదలపై ఎఫెక్ట్ పడింది.
దేవర మొదటి భాగం అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తారని, తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలు పోషించనున్నారని సమాచారం.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ), డెబ్యూ తెలుగు హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) నటిస్తున్నారు.2016లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది.ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల అవుతుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా కోసం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.