తెలంగాణ సీఎం కేసీఆర్
అంటే ఇప్పటి వరకు పార్టీ నేతల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ భయం భక్తులు కనిపించేవి కెసిఆర్ ఎంత ప్రేమగా అయితే ఉంటారో, అంతే స్థాయిలో విమర్శలు చేయడం లోనూ పార్టీ నేతలను తిట్టిపోయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు.ఇక మీడియా సమావేశాలు అప్పుడప్పుడు మాత్రమే నిర్వహిస్తూ ఉండే కేసీఆర్ కు అసలు మీడియా సమావేశాలు నిర్వహించడం అంటేనే పెద్ద చికాకు.
ఎందుకంటే ఏదో ఒకరకంగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా
జర్నలిస్ట్
లు ప్రశ్నలు వేయడం కేసీఆర్ కు ఏ మాత్రం ఇష్టం ఉండదు.అందుకే పార్టీ శ్రేణులు ఎవరు మీడియా డిబేట్ లో పాల్గొనకుండా పూర్తిస్థాయిలో కేసీఆర్ కట్టడి చేశారు.
మీడియా సమావేశం
నిర్వహించిన తాము చెప్పాల్సింది చెబుతూ విలేకరులకు ఇటువంటి అవకాశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇవ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులు ఏవైనా ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడిగితే అదే సమావేశంలో ప్రశ్నలు అడిగిన వారిపై విరుచుకుపడుతూ ఎదురు దాడి చేయడమే మార్గంగా కెసిఆర్ పెట్టుకున్నారు.
కొద్దికాలంగా కెసిఆర్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ లు చూస్తే ఈ ధోరణి ఎక్కువ అయినట్లుగా కనిపిస్తోంది.ప్రస్తుతం తెలంగాణలో
కరోనా వైరస్
వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో కెసిఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూనే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.రెండు రోజులకు ఒకసారి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వపరంగా తాము కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏం చేయబోతున్నాము అనే విషయాన్ని కెసిఆర్ క్లారిటీ గా చెప్తున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా, ప్రెస్ మీట్ కి వచ్చిన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కెసిఆర్ తనదైన శైలిలో గట్టిగా క్లాస్ పీకుతున్నారు.తాజాగా రేషన్ ఉచిత సరఫరా పై కేంద్ర సాయం చేయడం లేదంటూ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రశ్న అడిగినప్పుడు సమాధానం కూడా వినాలి అంటూ గట్టిగా హెచ్చరించారు.ఎక్కువ అడిగేవారికి ఎక్కువ చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం
వేరు అంటూ కెసిఆర్ ఎదురు ప్రశ్నించారు.మంచిది కాదు అంటూ మండిపడ్డారు.
ప్రజలకు అవసరమైన
రేషన్
ఇచ్చేందుకు కేంద్రం చేయాల్సిన సాయం చేస్తుందని, రాష్ట్రం చేయాల్సిన పని రాష్ట్రం చేస్తుందని కెసిఆర్ క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు ప్రపంచమంతా పెద్ద ప్రమాదంలో ఉందని ఈ సమయంలో
రాజకీయాలు
పక్కన పెట్టి అందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇక రేషన్ పోర్టబులిటీ గురించి ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కెసిఆర్ అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అసలు నీకు ప్రశ్నలు అడగడమే రాదు అంటూ మండిపడ్డారు.దీంతో కేసీఆర్ మీడియా సమావేశం అంటేనే జర్నలిస్టులు హడలెత్తి పోయే పరిస్థితి నెలకొంది.