జిన్నాటవర్ పేరు మార్చాలంటూ జయప్రకాష్ నారాయణ కామెంట్స్

జిన్నాటవర్ పేరు మార్చాలంటూ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా అనురాధ ను కలసి వినతిపత్రం అందజేసిన కేంద్ర కార్మిక సంక్షేమబోర్డు ఛైర్మన్ బీజేపీ ఎస్సి మోర్చా ఇంఛార్జ్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ,జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ నేతలు… జయప్రకాష్ నారాయణ కామెంట్స్ స్వతంత్ర భారతం అమృతోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సమయమిది.ఇలాంటి సమయంలో జిన్నా వంటి వేర్పాటు వాదుల పేరిట చిహ్నాలు ఉండటం అవసరమా.

 Jayaprakash Narayan Comments On Guntur Jinnah Tower Name Change, Jayaprakash Nar-TeluguStop.com

స్వాతంత్య్ర పోరాట సమయంలో జిన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టారు.పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడకు వెళ్లిన వారిని జిన్నా హత్య చేయించారు.

జిన్నా టవర్ పేరు మార్చి అబ్దుల్ కలాం పేరు పెట్టాలి.ఇదే డిమాండ్ తో కమిషనర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చాం.

కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిపి ఏకగ్రీవంగా ఆమోదించాలి.దేశం కోసం పాటుపడిన కలాం వంటి వారి పేర్లు పెట్టడం సముచితమని బీజేపీ భావన.గతంలో కూడా జిన్నా టవర్ పేరు మార్పుపై చర్చ జరిగింది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన హమీద్ పేరు పెట్టాలని గుంటూరు నగరపాలక సంస్థలో గతంలో తీర్మానం కూడా చేశారు.

జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ .జిన్నా టవర్ గుంటూరు నగరానికి ఆత్మగౌరవానికి మాయని మచ్చ.దేశ విభజన చేసి మారణహోమం సృష్టించిన వ్యక్తి పేరు మనకు అవసరమా.టవర్ పేరు మార్చకపోతే మేం కర సేవకులుగా మారతాం.బాబ్రీ మసీదు విషయంలో ఏం జరిగిందో చూశారు.జిన్నా టవర్ ను పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.

విద్వేషాలకు తావు లేకుండా టవర్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube