Pawan Kalyan : జనసేనాని పవన్ జిల్లాల పర్యటనపై ప్రణాళిక సిద్ధం..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) జిల్లాల పర్యటన నేపథ్యంలో ప్రణాళిక రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ మేరకు పవన్ పర్యటనకు ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధమైంది.175 నియోజకవర్గాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనువైన ప్రదేశాలను పార్టీ నేతలు గుర్తించారు.అయితే పర్యటనలో భాగంగా ప్రతి జిల్లాకు మూడు సార్లు వెళ్లాలని జనసేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు.

 Jana Senani Pawan Plans To Visit The Districts-TeluguStop.com

ఇందులో మొదటి పర్యటనలో భాగంగా జిల్లాల ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహించనున్నారు.కాగా రేపటి నుంచి గోదావరి జిల్లాల్లో( Godavari Districts ) ఆయన పర్యటించనున్నారు.నాలుగు రోజులు గోదావరి జిల్లాల్లోని ముఖ్య నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.అలాగే భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో కూడా ఆయన చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.

ఈ నెల 15న అమలాపురంలోని జిల్లా నేతలతో, 16న కాకినాడలోని నేతలతో సమీక్షలు చేయనున్నారు.అదేవిధంగా 17న రాజమండ్రి( Rajamahendravaram )లోని పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube