సైరన్ మోగిస్తే చంపేస్తామని అంబులెన్స్ డ్రైవర్స్ ని బెదిరించిన మాఫియా..

అంబులెన్స్ అంటే అత్యవసర వైద్యాన్ని రోగులకు అందించడానికి ఉపయోగిస్తారు.అంబులెన్స్ వెళుతున్నప్పుడు దారికి ఎవ్వరు అడ్డురాకుండా ఉండేందుకు ఒక సైరన్ ను మోగిస్తూ ఉంటారు.

 Italian Mafia Orders Ambulance Drivers To Stop Using Sirens,mafia Warns Ambulanc-TeluguStop.com

ట్రాఫిక్ ఎక్కువుగా ఉన్న సమయాల్లో లోపల ఉన్న రోగులకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని దారి నుండి తప్పుకోవాలని కుయ్ కుయ్ మంటూ శబ్దం చేసుకుంటూ వెళుతుంటారు.

ప్రజలు కూడా ఎక్కడ సైరన్ శబ్దం వినిపించినా అంబులెన్స్ కు అడ్డులేకుండా పక్కకు తప్పుకుంటారు.

కానీ తాజాగా అంబులెన్స్ డ్రైవర్స్ కు మాఫియా ఒక వార్ణింగ్ ఇచ్చింది.కుయ్ కుయ్ మంటూ శబ్దం చేసుకుంటూ వెళితే చంపేస్తామంటూ మాఫియా బెదిరిస్తుందని డ్రైవర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

పోలీసులు ఎస్కార్ట్‌గా రావాలని డ్రైవర్స్ కోరుతున్నారు.

ఈ సంఘటన ఇటలీలో చోటు చేసుకుంది.

ఇక్కడ అంబులెన్సు డ్రైవర్స్ మోగించే సైరన్ మాఫియాకు నిద్ర పట్టకుండా చేస్తుందట.అందుకే అంబులెన్సు డ్రైవర్స్ ను మాఫియా సైరన్ చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు.

ఇటలీలోని నేపుల్స్‌లో మాఫియా కార్యకలాపాలు చాలా ఎక్కువగా జరుగుతాయి.వారు అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటారు.

స్మగ్లింగ్, కిడ్నప్స్, హత్యలు వంటి బిజినెస్ లు అక్కడ జరుగుతాయి.చిన్న చిన్న బెదిరింపుల నుండి పెద్ద పెద్ద సెటిల్ మెంట్స్ వరకు ఇక్కడ జరుగుతాయి.అందుకే మాఫియాకు అంబులెన్సు, ఎమర్జెన్సీ వాహనాలు సైరెన్స్ ఇబ్బందిగా మారాయట.వీటి సైరన్ విని పోలీసులు వచేస్తున్నారనే భయంతో మాఫియా పరుగులు పెడుతున్నారట.

అందుకే ఆగ్రహానికి లోనైన మాఫియా అంబులెన్సు డ్రైవర్స్ కి సైరన్ మోగిస్తే చంపేస్తామని భేదిరించారట.ఈ మధ్య కరోనా కేసుల వల్ల ఎక్కువసార్లు తిరగాల్సి వస్తుందని దాంతో ఈ బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని వాపోతున్నారు.

ఈ విషయంపై అంబులెన్సు డ్రైవర్ మీడియాతో మాట్లాడుతూ.అంబులెన్సు నడుపుతున్న సమయంలో ఇద్దరు దుండగులు బైకు మీద వచ్చి అంబులెన్సు అద్దాలను గుద్దుతూ వెంటనే సైరన్ ఆపాలని.

ఆపకపోతే షూట్ చేస్తా అని హెచ్చరించారు.అందుకే మేము హాస్పిటల్ కు చేరే వరకు భద్రత కల్పించాలని కోరాం’’ అని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube