ఏలూరు జిల్లా పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు.ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో పనులు ఆలస్యంగా జరుగుతున్న మాట వాస్తవమేనని తెలిపారు.ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ ల మధ్యలో నీరు నిల్వ ఉండిపోయిందన్నారు.
దీంతో నిల్వ ఉన్న నీటిని డీ వాటరింగ్ చేస్తున్నారని చెప్పారు.కేంద్రం నుంచి నిధులు కూడా రావాల్సి ఉందన్న మంత్రి అంబటి ఇటీవల రూ.31,620 కోట్లకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు.తొలి కాంటూరు 41.15 నిర్మాణం,పరిహారం తరువాత 45.75 కాంటూరుపై ముందుకు వెళ్తామని చెప్పారు.డయాఫ్రమ్ వాల్ విషయంలో కేంద్రం జలశక్తి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.డయాఫ్రమ్ వాల్ రిపేర్లు చేయాలా లేదా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా అన్నది సందిగ్దంలోనే ఉందని తెలిపారు.