తెలుగులో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన టువంటి అ.ఆ సినిమాలో “రావణాసురుడి భార్య కూడా వాళ్ళ ఆయనని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుందని” తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అంటే నటన పరంగా ఈ అమ్మడికి చాలా టాలెంటు ఉన్నప్పటికీ ఇప్పటివరకు నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాక అలాగే సరైన హిట్ లేక చతికిల పడుతోంది.
ఈ మధ్యకాలంలో ఈ అనుపమ ప్రేమ విషయం గురించి కొన్ని వార్తలు నెట్టింట్లో బాగానే హల్చల్ చేస్తున్నాయి.
అయితే ఇందులో భారత జట్టు ప్రముఖ బౌలర్ బూమ్రా తో ప్రేమలో ఉన్నట్లు కొందరు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.అంతేకాక సోషల్ మీడియాలో బుమ్రా తనకు సంబంధించినటువంటి ఏ పోస్ట్ పెట్టినా అనుపమ లైక్ చేయడం కామెంట్లు చేయడం వంటివి చేస్తోంది.
దీంతో నెటిజన్లు అనుపమ పరమేశ్వరన్ బూమ్రా తో లవ్లో ఉన్నట్లు కన్ఫామ్ చేశారు.అయితే టాలీవుడ్ లో ఇలాంటి ప్రేమ పుకార్లకు కొదువలేదు.గతంలో కూడా డా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి భారత్ క్రికెట్ జట్టులోని ఓ ప్రముఖ క్రికెటర్ తో ప్రేమలో ఉందని పలు పుకార్లు వినిపించాయి.ఈ విషయంపై స్పందించిన అటువంటి అనుష్క శెట్టి అదేమీ లేదు అంటూ కొట్టిపారేసింది.
అయితే మరి ఈ వార్తలపై ఈసారి అనుపమ పరమేశ్వరన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.