IRCTC: జనరల్‌ టికెట్‌ కోసం గంటలకొద్దీ క్యూలో పడిగాపులు పడాల్సినవసరం ఇక లేదు!

భారత దేశంలో రైల్వే ప్రయాణానికి వున్న డిమాండ్ ఇంక దేనికీ ఉండదని చెప్పుకోవాలి.ఇక్కడ 90 శాతం ప్రజలు రైలు మార్గం గుండానే ప్రయాణిస్తారు.

 Irctc Uts App For Passangers To Book Unreserved Tickets Online-TeluguStop.com

ఇక చివరి నిమిషంలో రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు ఎక్కువగా జనరల్ బోగీల్లోనే పయనించడానికి ప్రిఫర్ చేస్తారు.అందుకే జనరల్ బోగీలు కిక్కిరిసిపోయి ఉంటాయి.

ఈ క్రమంలో ట్రైన్ ఎక్కే ముందు జనాల సాధకబాధల గురించి చెప్పుకోవాలి.అది మాటల్లో చెప్పలేనిది.

ఇలాంటి వాళ్లు సంబంధిత రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలోనే టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

దాంతో కొన్ని సార్లు గంటల తరబడి సదరు ప్రయాణికులు క్యూలో నిలబడాల్సి వస్తుంది.

ఒక్కోసారి టిక్కెట్ తీసుకునేలోపు రైలు కూడా వెళ్లిపోతుంది.పోనీ రైలు వెళ్లిపోతుందని టిక్కెట్ తీసుకోకుండా రైలెక్కితే తర్వాత జరగబోయే బాగోతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే, ఈ సమస్యకు ఇకపై చెక్ పడనుంది.జనరల్ టిక్కెట్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కొత్త సర్వీస్ ఒకదానిని తెరపైకి తీసుకొచ్చింది.

ఇకపై ప్రయాణికులు యాప్ ద్వారానే జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.

Telugu General Ticket, Indian Railways, Irctc, Irctc Ticket, Platm Tickets, Rail

రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన యాప్ పేరు UTS (అన్ రిజర్వ్‌డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్) యాప్ ద్వారా జనరల్ టిక్కెట్‌తోపాటు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చని సమాచారం.ఈ యాప్ ద్వారా ప్రయాణికులు క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా తప్పుతుంది.ఇక ఫైన్ కట్టాల్సిన పరిస్థితి కూడా ఉండదు.

సో దానికి మీరు చేయవలయిందల్లా ఒక్కటే.ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, జనరల్ లేదా ప్లాట్‌ఫామ్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.

యాప్‌లో లాగిన్ అయిన తర్వాత GPS ఆన్ చేసి, కనెక్ట్ చేసుకోవాలి.ఎందుకంటే జీపీఎస్ ద్వారానే ఇది పని చేస్తుంది కాబట్టి.

ప్లాట్‌ఫామ్ టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే రైల్వే స్టేషన్‌కు రెండు కిలోమీటర్లు లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి అని మర్చిపోవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube