పెళ్లికి సిద్ధమైన హీరో శర్వానంద్.... అమ్మాయి ఎవరో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారని చెప్పాలి.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ పెళ్లి ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేశారు.

 Hero Sharwanand Ready To Get Married Do You Know Who The Girl Is ,hero Sharwanan-TeluguStop.com

ఇలా పెళ్లి గురించి ఆలోచించని వారిలో నటుడు శర్వానంద్ ఒకరు.ఈయన దాదాపు 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరోలకు తమ్ముడి పాత్రలలో నటించిన శర్వానంద్ అనంతరం హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

శర్వానంద్ పెళ్లి వయసు దాటిపోతున్నప్పటికీ ఇంకా పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో తరచూ ఈయన పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈయన అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొనగా బాలకృష్ణ సైతం పెళ్లెప్పుడు అని ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకతోందని తెలుస్తోంది.శర్వానంద్ సైతం పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈయన హైదరాబాద్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.ఈమె అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నారని,గత కొన్ని నెలల వరకు ఈమె అమెరికాలోనే నివసించారని సమాచారం.అయితే ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం ఉండటం వల్ల తాను హైదరాబాదులోనే ఉన్నారని, ఈ అమ్మాయి తోనే శర్వానంద్ కు వివాహం నిశ్చయమైందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది, ఆ అమ్మాయి పేరు ఏంటి, తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలు గురించి త్వరలోనే తెలియనున్నాయి.ఇక శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Hero Sharwanand to marry a Telangana Girl

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube